
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగిన యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చినప్పటి నుంచే జైశ్వాల్ వెన్ను నొప్పితో బాధపడతున్నాడు.
పలు మార్లు మైదానంలోకి ఫిజియో వచ్చి అతడికి చికిత్స అందించాడు. ఓ వైపు గాయంతో బాధపడుతూనే జైశ్వాల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే ఆఖరికి వెన్ను నొప్పి తీవ్రంగా ఉండడంతో జైశ్వాల్ ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఓవరాల్‌గా 133 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు.
చదవండి: #Yashasvi Jaiswal: జైశ్వాల్ విధ్వంసకర సెంచరీ.. 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో