సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఈసారి కూడా అతడు ప్రొటిస్ పేసర్ కగిసో రబడ చేతికే చిక్కడం గమనార్హం.
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్టులో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. కఠినమైన పిచ్‌పై సఫారీ పేసర్ల ధాటికి తాళలేక 67.4 ఓవర్లలో కేవలం 245 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.
ఓపెనర్ రోహిత్ శర్మ ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు కగిసో రబడ అద్భుతమైన బంతితో అతడిని బోల్తా కొట్టించాడు. బాల్‌ను తప్పుగా అంచనా వేసిన రోహిత్.. నండ్రీ బర్గర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఇక భారత తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ 101 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి 38 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. మూడో రోజు ఆట సందర్భంగా గురువారం 408 పరుగులకు ఆలౌట్ అయింది.
ఓపెనర్ డీన్ ఎల్గర్ సూపర్ సెంచరీ(185), అరంగేట్ర బ్యాటర్ బెడింగ్‌హామ్ అర్ధ శతకం(56), మార్కో జాన్సెన్ సూపర్ ఇన్నింగ్స్ (84- నాటౌట్) కారణంగా 163 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రబడ మరోసారి మాయ చేసి అద్భుత బంతితో రోహిత్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో ఎనిమిది బంతులు ఎదుర్కొన్న భారత జట్టు సారథి పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌతాఫ్రికాతో టెస్టుల్లో రోహిత్ గణాంకాల(14, 6, 0, 25, 11, 10, 10, 47, 5 , 0)ను ప్రస్తావిస్తూ #Duck అభిమానులు సైతం పేరిట ట్రోల్ చేస్తున్నారు. ‘‘రోహిత్ ఇక టెస్టుల నుంచి కూడా రిటైర్ అయిపో’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(5)ను నండ్రీ బర్గర్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది.
Rohit Sharma in South Africa Tests :
— 𝐊𝐨𝐡𝐥𝐢𝐧𝐚𝐭!𝟎𝐧_👑🚩 (@bholination) December 28, 2023
14, 6, 0, 25, 11, 10, 10, 47, 5 , 0
Average : 12.8
Choking of highest quality. pic.twitter.com/FzGMgViyl1
Rohit Sharma dismissed for a duck Rabada nuked him again 😭#INDvsSA || #SAvsIND
— Rishi (@EpicVirat) December 28, 2023
pic.twitter.com/eK7stVrpFZ
Comments
Please login to add a commentAdd a comment