సెంచూరియన్‌లో చారిత్రాత్మక విజయంతో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు సన్నద్ధమవుతోంది టీమిండియా. వాండరర్స్‌లో తమకున్న అద్బుత రికార్డును కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి డుమ్మా కొట్టాడు. దీంతో బోర్డుతో కోహ్లికి మళ్లీ విభేదాలేమైనా తలెత్తాయా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం గురించి మీడియా ప్రతినిధులు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను ప్రశ్నించారు.
ఇందుకు స్పందించిన ద్రవిడ్ మాట్లాడుతూ... ‘‘కోహ్లి గైర్హాజరీకి ప్రత్యేకంగా కారణాలేమీ లేవు. వందో టెస్టుకు ముందు తను మాట్లాడతాడేమో. ఆ అరుదైన మైలురాయిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. 100వ టెస్టు నేపథ్యంలో మీరు తనను ప్రశ్నలు అడగవచ్చు’’ అని సమాధానమిచ్చాడు. ఇక వాండరర్స్ పిచ్ గురించి చెబుతూ... సెంచూరియన్‌లో ఉన్నంత బౌన్సీగా వికెట్ ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా జనవరి 3న ఆరంభం కానున్న రెండో టెస్టు కోహ్లికి 99వది. ఇక ఈ టెస్టులో గనుక టీమిండియా విజయం సాధిస్తే సఫారీ గడ్డమీద టెస్టు సిరీస్ గెలిచిన తొలి భారత జట్టుగా కోహ్లి సేన సరికొత్త రికార్డు సృష్టిస్తుంది.
చదవండి: Vamika Kohli: మ.. మ్మా అంటున్న వామిక... ఎంత క్యూట్‌గా ఉందో... ఫొటో కూడా షేర్ చేయండి వదినా అంటూ
Ind Vs Sa 2nd Test: అక్కడ ఒక్కసారి కూడా భారత్ టెస్టు ఓడలేదు.. వాళ్లిద్దరికీ సూపర్ రికార్డు.. కాబట్టి
Comments
Please login to add a commentAdd a comment