త్వరలో శ్రీలంకతో జరుగబోయే వన్డే సిరీస్‌లో రెండు భారీ రికార్డులపై కన్నేశాడు బ్యాటింగ్ లెజెండ్ విరాట్ కోహ్లి. ఈ సిరీస్‌లో విరాట్ మరో 152 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 27000 పరుగులు (మూడు ఫార్మాట్లలో).. మరో 116 పరుగులు చేస్తే వన్డేల్లో 14000 పరుగుల అరుదైన మైలురాళ్లను తాకుతాడు. ప్రస్తుతం విరాట్ 652 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 26884 పరుగులు.. 292 వన్డేల్లో 13848 పరుగులు చేసి ఈ తరం క్రికెటర్లలో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (34357), కుమార సంగక్కర (28016), రికీ పాంటింగ్ (27483) మాత్రమే కోహ్లి కంటే ముందున్నారు. వన్డేల విషయానికొస్తే.. ఈ ఫార్మాట్‌లో సచిన్ (18426), సంగక్కర (14234) మాత్రమే కోహ్లి కంటే ఎక్కువ పరుగులు చేశారు. రెండు విభాగాల్లో ప్రస్తుత తరం క్రికెటర్లలో ఒక్కరు కూడా కోహ్లి దరిదాపుల్లో లేరు.
విరాట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో (ప్రస్తుత తరం క్రికెటర్లలో) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జో రూట్ ఉన్నాడు. రూట్ 344 మ్యాచ్‌ల్లో 19219 పరుగులు చేశాడు. వన్డేల్లో విరాట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్రస్తుత తరం ఆటగాడిగా రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్.. 262 వన్డేల్లో 10709 పరుగులు చేశాడు.
కాగా, శ్రీలంకలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్‌లలో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డేలు జరుగుతాయి. కోహ్లి, రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో టీ20 జట్టులో లేరు. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి.
అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది. లంకలో పర్యటించే భారత జట్లను నిన్ననే ప్రకటించారు. వన్డే జట్టుకు రోహిత్.. టీ20 టీమ్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
Comments
Please login to add a commentAdd a comment