India Beat Bangladesh by 31 Runs to Win Title - Sakshi
Sakshi News home page

Emerging Asia Cup 2023: బంగ్లాదేశ్‌ చిత్తు.. ఆసియాకప్‌ విజేతగా భారత్‌..

Published Wed, Jun 21 2023 1:45 PM | Last Updated on Wed, Jun 21 2023 2:14 PM

India beats Bangladesh by 31 runs to win title - Sakshi

ఏసీసీ మహిళల ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ 2023 ఛాంపియన్స్‌గా భారత జట్టు అవతరించింది. హాంగ్ కాంగ్‌ వేదికగా జరిగిన ఫైనల్‌లో బం‍గ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్‌.. తొట్ట తొలి మహిళల ఎమర్జింగ్‌ ఆసియా విజేతగా నిలిచింది. 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. భారత బౌలర్లు చెలరేగడంతో 96 పరుగులకే కుప్పకూలింది.

శ్రేయాంక పాటిల్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మన్నత్ కశ్యప్ మూడు, కనిజా రెండు వికెట్లు సాధించారు. బంగ్లా బ్యాటర్లలో నహీదా అక్తర్‌ 17 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఇక అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.

భారత బ్యాటర్లలో విరిందా దినేష్‌(36), కనినా అహుజా(30) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాటాన్‌, నహిదా ఖాన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా..  రెబియా ఖాన్‌, సంజిదా చెరో వికెట్‌ సాధించారు.
చదవండి: Ashes 2023: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌కు బిగ్‌ షాక్‌.. భారీ జరిమానా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement