బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పరుగుల వరద పారిస్తాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ అంచనా వేశాడు. కేవలం శతకాలకే పరిమితం కాకుండా.. డబుల్ సెంచరీలతో చెలరేగుతాడని జోస్యం చెప్పాడు. కోహ్లిలో ఇంకా ఆడగల సత్తా మిగిలే ఉందని.. భారత జట్టులోని చాలా మంది యువ ఆటగాళ్ల కంటే అతడే మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని పేర్కొన్నాడు.
సుదీర్ఘ విరామం తర్వాత
శ్రీలంక పర్యటన తర్వాత నెలరోజులకు పైగా విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లి.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో భాగంగా సొంతగడ్డపై సెప్టెంబరు 19 నుంచి ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలి టెస్టుకు ఇప్పటికే పదహారు మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
ఇందులో కోహ్లికి కూడా చోటు దక్కింది. కాగా ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత భారత జట్టు మళ్లీ టెస్టు బరిలో దిగడం ఇదే తొలిసారి. అయితే, నాడు ఇంగ్లిష్ జట్టుతో సిరీస్‌కు కోహ్లి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తన సతీమణి అనుష్క శర్మ తమ కుమారుడు అకాయ్‌కు జన్మనిచ్చే క్రమంలో లండన్‌కు వెళ్లిన ఈ స్టార్ బ్యాటర్.. సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండలేకపోయాడు.
విరాట్ డబుల్ సెంచరీ చేస్తాడు
ఈ పరిణామాల నేపథ్యంలో బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్ సిరీస్ ఆడిన భారత జట్టులో విరాట్ లేడు. శ్రీలంకతో వన్డేల్లోనూ అతడు రాణించకలేకపోయాడు. అయినప్పటికీ బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో టెస్టు సిరీస్‌లో విరాట్ నుంచి మనం భారీ శతకాలు చూడబోతున్నాం. 110 లేదంటే 115 పరుగులకు అతడు పరిమితం కాడు. 200 పరుగుల మార్కును కూడా అతడు అందుకోగలడు’’ అని పేర్కొన్నాడు.
ఇక ఈ సందర్భంగా బంగ్లాతో తొలి టెస్టుకు భారత తుదిజట్టును కూడా బసిత్ అలీ ఎంచుకున్నాడు. మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్‌కు చోటిచ్చిన అతడు.. సర్ఫరాజ్ ఖాన్‌ను పక్కనపెట్టాడు. కాగా బంగ్లాదేశ్‌తో సిరీస్ తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌తో టెస్టులు ఆడనుంది.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. బసిత్ అలీ భారత తుదిజట్టు అంచనా
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ , కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
చదవండి: బుమ్రా కాదు!.. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్ అతడే: కేఎల్ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment