అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిని అవుట్ చేయడంద్వారా ముంబై బౌలర్ బుమ్రా ఐపీఎల్‌లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. యాదృచ్చికంగా ఐపీఎల్‌లో బుమ్రా తొలి వికెట్, 100వ వికెట్ కోహ్లినే కావడం విశేషం. అంతేకాకుండా టి20 క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి భారత పేస్ బౌలర్‌గా, ఓవరాల్‌గా ఆరో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.
ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 20 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్‌లో 8వ ఐపీఎల్ ఆడుతున్న అతడు 20 వికెట్ల ఫీట్ సాధించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మొత్తం 89 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన బుమ్రా ఇప్పటివరకు 102 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ప్రస్తుతం 15వ స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ మెంటార్ లసిత్ మలింగ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, అరుదైన ఫీట్ సాధించిన బుమ్రాపై ఫ్రాంచైజీతో పాటు క్రీడాభిమానులు అభినందనలు కురిపిస్తున్నారు.
అప్పుడేం జరిగింది?
ఏడేళ్ల క్రితం నాటి సంగతి. ఏప్రిల్ 4, 2013న బెంగళూరు చినస్వామి మైదానంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్. విరాట్ కోహ్లి అప్పటికే మంచి బ్యాట్స్‌మన్‌గా పేరు సంపాదించాడు. గుజరాత్‌కు చెందిన 19 ఏళ్ల యువ బౌలర్‌ను ముంబై ఇండియన్స్ టీమ్ బరిలోకి దింపింది. తన మొదటి ఓవర్‌ను కోహ్లికి వేయాల్సి వచ్చింది. వరుసగా మూడు బౌండరీలతో కొత్త బౌలర్‌కు కోహ్లి స్వాగతం పలికాడు. దీంతో బుమ్రా కొంచెం ఒత్తడికి లోనయి తర్వాతి బంతిని వైడ్ వేశాడు. దాన్ని అందుకునే క్రమంలో కోహ్లి ఔటయ్యాడు. ఐపీఎల్‌లో బుమ్రాకు ఇదే తొలి వికెట్. ఏడేళ్ల తర్వాత వందో వికెట్‌గా కోహ్లిని బుమ్రా ఔట్ చేయడం విశేషం. (చదవండి: మొదటి అడుగు ముంబైదే!)
1️⃣st IPL wicket 👉 Virat Kohli ✅
— Mumbai Indians (@mipaltan) October 28, 2020
💯th IPL wicket 👉 Virat Kohli ✅
Well done, @Jaspritbumrah93 👏#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL #MIvRCB pic.twitter.com/vMU2AglznX
Comments
Please login to add a commentAdd a comment