
PC: Sports Star
IPL 2024 CSK vs KKR Live Updates :
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. కేకేఆర్ చిత్తు
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మరో అద్భుత విజయం సాధించింది. చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతో సీఎస్‌కే విజయం సాధించింది.
138 పరుగు స్వల్ప లక్ష్యాన్ని సీఎస్‌కే 17. 4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. చెన్నై బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 58 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(28) మరోసారి అదరగొట్టాడు.
కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా రెండు వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఒక్క వికెట్ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 137 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్‌కే బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు.
సీఎస్‌కే బౌలర్లలో రవీంద్ర జడేజా, తుషార్ దేశ్ పాండే తలా మూడు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్ రెండు, థీక్షణ ఒక్క వికెట్‌సాధించారు. కేకేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
రెండో వికెట్ డౌన్
97 పరుగుల వద్ద సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన డార్లీ మిచెల్.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. సీఎస్‌కే విజయానికి 42 బంతుల్లో 39 పరుగులు కావాలి,
రుతురాజ్ గైక్వాడ్ ఫిప్టీ..
12 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. క్రీజులో గైక్వాడ్(51)తో పాటు డార్లి మిచెల్(25) పరుగులతో ఉన్నారు.
8 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 67/1
8 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్(34), డార్లీ మిచెల్(16) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర.. వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు.
3 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 27/0
138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 3 ఓవర్లు ముగిసే సరికి 26 పరుగులు చేసింది. క్రీజులో రచిన్ రవీంద్ర(15), రుతురాజ్ గైక్వాడ్(9) పరుగులతో ఉన్నారు.
తడబడిన కేకేఆర్ బ్యాటర్లు.. సీఎస్‌కే టార్గెట్ 138 పరుగులు
చెపాక్ వేదికగా సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు తడబడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 137 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్‌కే బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు.
సీఎస్‌కే బౌలర్లలో రవీంద్ర జడేజా, తుషార్ దేశ్ పాండే తలా మూడు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్ రెండు, థీక్షణ ఒక్క వికెట్‌సాధించారు. కేకేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఐదో వికెట్ డౌన్.. రమణ్‌దీప్ సింగ్ ఔట్
85 పరుగుల వద్ద కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రమన్‌దీప్ సింగ్.. థీక్షణ బౌలింగ్‌లో ఔటయ్యాడు.క్రీజులోకి రింకూ సింగ్ వచ్చాడు. 14 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 94/5
నాలుగో వికెట్ డౌన్.. వెంకటేశ్ అయ్యర్ ఔట్
64 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్.. జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రమణ్‌దీప్ సింగ్ వచ్చాడు. 10 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 70/4
కేకేఆర్‌కు బిగ్ షాక్.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
జడేజా వేసిన 7 ఓవర్‌లో కేకేఆర్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత రఘు వంశీ(24) ఎల్బీ రూపంలో ఔట్ కాగా. . సునీల్ నరైన్ క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి వెంకటేశ్ అయ్యర్ వచ్చాడు.
3 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 26/1
3 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో రఘువన్షీ(6), సునీల్ నరైన్(15) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్.. సాల్ట్ ఔట్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. తుషార్ దేశ్‌పాండే వేసిన మొదటి ఓవర్‌లో తొలి బంతికే ఫిల్ సాల్ట్ ఔటయ్యాడు.
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సీఎస్‌కే మూడు మార్పులతో బరిలోకి దిగింది.
గాయం కారణంగా దీపక్ చాహర్ దూరం కాగా.. ముస్తఫిజుర్ రెహ్మన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా రిజ్వీ, శార్ధూల్ ఠాకూర్ సీఎస్‌కే జట్టులోకి వచ్చారు. మరోవైపు కేకేఆర్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.
తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(c), అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి
Comments
Please login to add a commentAdd a comment