IPL 2024 GT vs LSG Live Updates:
గుజరాత్‌పై లక్నో ఘన విజయం
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఎక్నా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 18.5 ఓవర్లలో కేవలం 130 పరుగులకే కుప్పకూలింది.
లక్నో పేసర్ యష్ ఠాకూర్ 5 వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించగా.. కృనాల్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అతడితో పాటు నికోలస్ పూరన్(32 నాటౌట్), కేఎల్ రాహుల్(33) పరుగులతో పర్వాలేదన్పించారు. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దర్శన్ నల్కండే తలా రెండు వికెట్లు సాధించగా.. రషీద్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు.
15 ఓవర్లకు గుజరాత్ స్కోర్ : 93/7
15 ఓవర్లు ముగిసే సరికి లక్నో 7 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. 15 ఓవర్ వేసిన యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో గజరాత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. విజయ్ శంకర్, రషీద్ ఖాన్ వరుస క్రమంలో ఔటయ్యారు.
ఐదో వికెట్ డౌన్
81 పరుగుల వద్ద గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన దర్శన్ నల్కండే.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. గుజరాత్ విజయానికి 42 బంతుల్లో 82 పరుగులు కావాలి. క్రీజులో విజయ్ శంకర్(9), రాహుల్ తెవాటియా(1) పరుగులతో ఉన్నారు.
61 పరుగులకే 4 వికెట్లు.. కష్టాల్లో గుజరాత్
9వ ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో గుజరాత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత సాయిసుదర్శన్ ఔట్ కాగా.. అనంతరం శరత్ ఔటయ్యాడు. 9 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 61/4
గుజరాత్ రెండో వికెట్ డౌన్.. కేన్ విలియమ్సన్ ఔట్
58 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన కేన్ విలియమ్సన్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 58/2
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. గిల్ ఔట్
54 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కేన్ విలియమ్సన్ వచ్చాడు. 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 54/1
3 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 22/0
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. క్రీజులో సాయి సుదర్శన్(12), శుబ్‌మన్ గిల్(8) పరుగులతో ఉన్నారు.
రాణించిన లక్నో బ్యాటర్లు.. గుజరాత్ టార్గెట్ 164 పరుగులు
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అతడితో పాటు నికోలస్ పూరన్(32 నాటౌట్), కేఎల్ రాహుల్(33) పరుగులతో పర్వాలేదన్పించారు. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దర్శన్ నల్కండే తలా రెండు వికెట్లు సాధించగా.. రషీద్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు.
లక్నో నాలుగో వికెట్ డౌన్.. స్టోయినిష్ ఔట్
మార్కస్ స్టోయినిష్ రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన స్టోయినిష్.. దర్శన్ నల్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు లక్నో స్కోర్: 114/4
లక్నో మూడో వికెట్.. కేఎల్ రాహుల్ ఔట్
91 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. దర్శన్ నల్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి పూరన్ వచ్చాడు. 13 ఓవర్లకు లక్నో స్కోర్: 93/3
10 ఓవర్లకు లక్నో స్కోర్: 74/2
10 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. క్రీజులో స్టోయినిష్(29), కేఎల్ రాహుల్(28) పరుగులతో ఉన్నారు
6 ఓవర్లకు లక్నో స్కోర్: 47/2
6 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో స్టోయినిష్(16), కేఎల్ రాహుల్(13) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ డౌన్.. పడిక్కల్ ఔట్
18 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన దేవ్‌దత్త్ పడిక్కల్.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు లక్నో స్కోర్: 18/2
తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. డికాక్ ఔట్
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 6 పరుగులు చేసిన డికాక్.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఐపీఎల్-2024లో భాగంగా లక్నో వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. గుజరాత్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. గుజరాత్ జట్టుకు వృద్దిమాన్ సహా, ఒమర్జాయ్ దూరం కాగా.. శరత్, స్పెన్సర్ జాన్సన్ తుది జట్టులోకి వచ్చారు.
తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్
గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్), శరత్ బిఆర్(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment