IPL 2022: Fans Praises Hardik Pandya For His Captain Innings Against RR, Twitter Reactions Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2022: ముంబై ఇండియన్స్‌ అతడిని వదిలేసి పెద్ద తప్పు చేసింది.. అందుకే ఇలా..!

Published Fri, Apr 15 2022 9:03 AM | Last Updated on Fri, Apr 15 2022 10:49 AM

MI definitely lost a diamond,Twitter hails Hardik Pandya for his captain Innings Aginst RR - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 87 పరుగులు చేసి గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాకుండా బౌలింగ్‌లో కూడా కీలక వికెట్‌ పడగొట్టాడు. కాగా ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ 228 పరుగులతో పాటు మూడు వికెట్లు సాధించాడు.

ఈ క్రమంలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్న హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "కెప్టెన్‌గా అరంగేట్రంలోనే హార్దిక్ పాండ్యా అద్భుతం‍గా రాణిస్తోన్నాడు. అతడు బాల్‌తోను, బ్యాట్‌తోను దుమ్ము దులుపుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌ భారత జట్టులో అతడు కచ్చింతంగా ఉంటాడు"  అని ఓ యూజర్‌ కామెం‍ట్‌ చేశాడు. మరి కొంత మంది "హార్దిక్‌ను విడిచి పెట్టి ముంబై ఇండియన్స్‌ పెద్ద తప్పు చేసింది" అని కామెం‍ట్‌లు చేస్తున్నారు.

కాగా ముంబై ఇండియన్స్‌ ఇప్పటి వరకు ఐపీఎల్‌-2022లో బోణి కొట్టలేదు. ఆడిన 5 మ్యాచ్‌ల్లోను ఓటమి చెంది పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌ హార్దిక్‌ను రీటైన్‌ చేసుకోలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హిట్టర్‌ కీరన్‌ పొలార్డ్‌(వెస్టిండీస్‌), స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌లను అట్టిపెట్టుకుంది.  దీంతో గుజరాత్‌ టైటాన్స్‌ రూ.15 కోట్ల​కు పాండ్యాతో ఒప్పందం కుదర్చుకుని, కెప్టెన్సీ బాద్యతలు అప్పజెప్పింది.

చదవండి: IPL 2022: హార్దిక్‌ పాండ్యా మెరుపులు.. రాజస్తాన్‌పై గుజరాత్‌ ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement