టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో తమ తొలి రెండు మ్యాచ్‌లకు ఎంపిక చేసిన బెంగాల్ జట్టులో మహ్మద్ కైఫ్‌కు చోటుదక్కింది. లిస్ట్-ఏ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తుండడంతో కైఫ్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. 2021లో బెంగాల్ తరపున లిస్ట్-ఏ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.
ఈ ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా కైప్ అదరగొట్టాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన కైఫ్ 12 వికెట్లు పడగొట్టాడు. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో బెంగాల్ జట్టుకు ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారీ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
బెంగాల్ జట్టు
మనోజ్ తివారీ(కెప్టెన్), అనుస్తుప్ మజుందార్, సుదీప్ ఘరామి, అభిషేక్ పోరెల్, సౌరవ్ పాల్, శ్రేయాన్ష్ ఘోష్, శుభమ్ ఛటర్జీ, రంజోత్ ఖైరా, ఇషాన్ పోరెల్, ఆకాశ్ దీప్, కౌశిక్ మైతీ, కరణ్ లాల్, సూరజ్ జైస్వాల్, అన్కీ మహ్మద్ కైఫ్ , ప్రయాస్ బర్మన్, ప్రదీప్త ప్రమాణిక్, సుమన్ దాస్.
Comments
Please login to add a commentAdd a comment