వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరం కాగా.. ఇప్పుడు మరో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జడ్డూ మోకాలి గాయం మళ్లీ తిరగబెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ఈ మోకాలి గాయం కారణంగానే టీ20 ప్రపంచకప్-2022కు దూరమైన జడేజా.. అనంతరం తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ జడేజా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి జట్టులో కొనసాగుతూ వచ్చిన జడ్డూ.. బంగ్లాతో మ్యాచ్‌లో మాత్రం ఎడమ మోకాలికి ఐస్ ప్యాక్ వేసుకుంటూ కన్పించాడు.
కానీ ఫీల్డ్‌లో మాత్రం జడ్డూ చాలా యాక్టివ్‌గా కన్పించాడు. బుమ్రా బౌలింగ్‌లో ఓ అద్బుతమైన క్యాచ్‌ను కూడా అందుకున్నాడు. అయితే అతడి గాయం అంత తీవ్రమైనది కాదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం జడేజా బాగానే ఉన్నాడు. శస్త్రచికిత్స జరిగినప్పడు చాలా కాలం పాటు విశ్రాంతి అవసరం. ముఖ్యంగా మోకాలి గాయాలు తిరగబెడతాయి. బంగ్లాతో మ్యాచ్‌లో కాస్త ఇబ్బంది పడుతూ కన్పించాడు.
అందుకే ఐస్ ప్యాక్ వేసుకున్నాడు. అయితే అతడి ఫిట్‌నెస్‌పై మాకు ఎటువంటి ఆందోళనలేదు. మా వైద్య బృందం, ఫిజియోలు జడేజా సహా ఆటగాళ్లందరిపై కూడా ఓ కన్నేసి ఉంచారు అని సదరు అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: IND vs NZ WC 2023: టీమిండియాతో మ్యాచ్.. న్యూజిలాండ్‌కు గుడ్ న్యూస్!
Comments
Please login to add a commentAdd a comment