‘ప్లే ఆఫ్స్’ చేరిన పుణేరి పల్టన్(PC: PKL X)
PKL 10- న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో పుణేరి పల్టన్ జట్టు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. సోమవారం పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ఇరు జట్లూ 30–30 పాయింట్ల స్కోరుతో సమంగా నిలిచాయి. పుణేరి తరఫున అస్లామ్ ముస్తఫా 10 పాయింట్లు స్కోరు చేయగా... దబంగ్ కెప్టెన్ అషు మలిక్ 8 పాయింట్లు నమోదు చేశాడు.
ఈ మ్యాచ్ అనంతరం 17 మ్యాచ్‌ల ద్వారా మొత్తం 71 పాయింట్లు సాధించిన పుణేరి ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 36–33 పాయింట్ల తేడాతో పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. పట్నా తరఫున కెప్టెన్ సచిన్, సుధాకర్ చెరో 10 పాయింట్లతో చెలరేగగా జైపూర్ ఆటగాళ్లలో అర్జున్ దేశ్వాల్ (12 పాయింట్లు) రాణించాడు.
ఇదిలా ఉంటే.. జైపూర్ పింక్ పాంథర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో పాంథర్స్ తర్వాత టాప్-4కు చేరుకున్న రెండో జట్టుగా పుణేరి పల్టన్ నిలిచింది. అయితే, తెలుగు టైటాన్స్ మాత్రం ఈసారి కూడా కనీస ప్రదర్శన కనబరచలేక ఇప్పటికే పదహారు మ్యాచ్‌లలో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది.
చదవండి: Ind vs Eng: హైడ్రామా.. అలా నాటౌట్.. ఇలా కూడా నాటౌటేనా?.. రోహిత్ సీరియస్
Admin's next task: Adding 𝐐 in the #PKLSeason10 Points Table graphic 😉@PuneriPaltan 🧡 join defending champions Jaipur Pink Panthers in confirming a #PKLPlayoffs spot 🔥#ProKabaddi #ProKabaddiLeague #PKL #HarSaansMeinKabaddi #PuneriPaltan pic.twitter.com/gBCs3zGJ6s
— ProKabaddi (@ProKabaddi) February 5, 2024
సహజ సంచలన విజయం
ముంబై: తెలుగమ్మాయి సహజ యమలపల్లి ముంబై ఓపెన్ (డబ్ల్యూటీఏ–125) టెన్నిస్ టోర్నీలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలి రౌండ్‌లో సహజ 6–4, 1–6, 6–4 స్కోరుతో వరల్డ్ నంబర్ 92, టాప్ సీడ్ కేలా డే (అమెరికా)ను ఓడించింది. మ్యాచ్‌లో 2 ఏస్‌లు కొట్టిన సహజ 4 డబుల్‌ఫాల్ట్‌లు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment