
PC: Twitter
ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను రూ.15 కోట్లకు ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా మరో ఇప్పుడు మరో స్టార్ ఆటగాడు ఫ్రాంచైజీ మారనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడు ఎవరో కాదు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్.
డికాక్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రేడ్ చేసుకోనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. డికాక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్-2023లో దుమ్మురేపాడు. అయితే గత కొన్ని సీజన్ల నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌కు సరైన ఓపెనింగ్ జోడి లేకపోవడంతో స్టార్ ఓపెనర్ అయినా డికాక్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోందట.
ఇప్పటికే లక్నోతో పాటు డికాక్‌తో కూడా ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాగా ఐపీఎల్-2023 మినీవేలంలో డికాక్‌ను రూ. 6.75 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. ఐపీఎల్-2024 సీజన్‌కు కూడా అతడినికి లక్నో రిటైన్ చేసుకుంది. ఇక ఇప్పటివరకు 96 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన డికాక్.. 2907 పరుగులు చేశాడు. టెస్టు,వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన డికాక్.. కేవలం టీ20ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. కాగా ఐపీఎల్-2024కు సంబంధిచిన వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది.
చదవండి: IND vs AFG: పాకిస్తాన్ పొమ్మంది.. సల్మాన్ బట్‌కు అఫ్గానిస్తాన్ బంపరాఫర్!?
Comments
Please login to add a commentAdd a comment