
శ్రీలంకతో జరుగతోన్న రెండో టెస్టు తొలి రోజు ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన మహ్మద్ షమీ బౌలింగ్‌లో.. దనుంజయ డి సిల్వా డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి మిస్స్ అయ్యి నేరుగా బ్యాటర్ ప్యాడ్‌కు తగిలింది. దీంతో భారత ఫీల్డర్లు ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేశారు. అయితే ఫీల్డ్ అంపైర్ అప్పీల్‌ను తిరస్కరించాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ.. రిషబ్ పంత్, విరాట్ కోహ్లితో చర్చించి రివ్యూకు వెళ్లాడు.
కాగా రీప్లేలో ఆది ఔట్‌గా తేలింది. దీంతో భారత ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లలో మునిగి పోయారు. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్.. మహ్మద్ షమీ తలపై 'తబలా' వాయిస్తూ ఫన్నీ సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. దానికి తగ్గట్టు గానే షమీ కూడా తల ఊపాడు. సాదరణంగా ఫీల్డ్‌లో అశ్విన్ ఇటువంటి సంబురాలు జరుపుకోవడం అరుదుగా చూస్తూ ఉంటాం. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఓ నెటిజన్ స్పందిస్తూ.. "అశ్విన్ ఏం చేస్తున్నావు.. ఏంటి ఆ పని" అని కామెంట్ చేశాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆటముగిసే సమయానికి 30 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులే చేయగలిగింది. అంతకు ముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా 252 పరుగులు చేయడంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ 98 బంతుల్లో 92 పరుగులు చేశాడు.
That's some way to celebrate 😂 pic.twitter.com/wqLyvvXS5a
— Sports Hustle (@SportsHustle3) March 12, 2022