
PC: IPL.com
ఐపీఎల్-2023లో వరుసగా మూడు విజయాలు సాధించి మంచి జోష్ మీద ముంబై ఇండియన్స్‌కు పంజాబ్ కింగ్స్ ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబైను 13 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓడించింది.
215 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. చివరి ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని రోహిత్ కొనియాడాడు.
పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ మాట్లాడుతూ.. డెత్ ఓవర్లలో మా బౌలర్లు విఫలమయ్యారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అది అస్సలు నేను ఊహించలేదు. అదే విధంగా ఫీల్డింగ్‌లో కూడా కొన్ని తప్పిదాలు చేశాం. అయితే మేము ఆఖరివరకు అద్భుతంగా పోరాడం. కాబట్టి ఈ ఓటమిని మరీ సీరియస్‌గా తీసుకొని దిగులు చెందాల్సిన అవసరములేదు.
ఇప్పటివరకు మేము ఆరు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించాము.ఈ టోర్నీలో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఎదైనా జరగవచ్చు. అయితే ఈ మ్యాచ్‌లో కొన్ని పొరపాట్లు చేశాము. మా తదుపరి మ్యాచ్‌ల్లో వాటిని సరిదిద్దుకుంటాం.
ఇక సూర్య, గ్రీన్ అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా సూర్య ఫామ్‌లోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఆఖరి వరకు ఉండి ఉంటే మేము విజయం సాధించేవాళ్లం. కానీ ఆఖరి ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కాబట్టి క్రెడిట్ మొత్తం అతడికే దక్కాలి" అని పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా