అయ్యర్‌తో అట్లంటుంది.. వరల్డ్‌కప్‌లో భారీ సిక్సర్‌! వీడియో వైరల్‌ | IND Vs SL: Shreyas Iyer Slams Longest Six Of ODI World Cup 2023 During Match Against Sri Lanka, Video Goes Viral - Sakshi
Sakshi News home page

CWC 2023 IND Vs SL: అయ్యర్‌తో అట్లంటుంది.. వరల్డ్‌కప్‌లో భారీ సిక్సర్‌! వీడియో వైరల్‌

Published Thu, Nov 2 2023 5:49 PM | Last Updated on Thu, Nov 2 2023 6:22 PM

Shreyas Iyer Slams Longest Six Of ODI World Cup 2023 During Sri Lanka  - Sakshi

వన్డే వరల్డ్‌కప్ 2022లో భారీ సిక్స్ నమోదైంది. వాంఖడే వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఓ భారీ సిక్సర్‌ కొట్టాడు. భారత ఇన్నింగ్స్‌ 36 ఓవర్‌లో రజిత వేసిన నాలుగో బంతిని లాంగాన్‌ మీదగా భారీ సిక్స్‌ర్‌ బాదాడు. అతను కొట్టిన షాట్‌కి బంతి 106 మీటర్ల దూరం వెళ్లింది.

కాగా ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ పేరిట ఉండేది. ఈ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ 104 మీటర్ల సిక్స్‌ కొట్టాడు. తాజా మ్యాచ్‌తో మ్యాక్సీ రికార్డును అయ్యర్‌ బ్రేక్‌ చేశాడు.

అయ్యర్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌..
ఇ​క ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. శ్రీలంక బౌలర్లను అయ్యర్‌ ఊచకోత కోశాడు. కేవలం 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు.
చదవండి: World cup 2023: అయ్యో శుబ్‌మన్‌.. సెంచరీ జస్ట్‌ మిస్‌! సారా రియాక్షన్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement