Trolls and Memes Viral After India Epic Win at Lord’s Test Against England - Sakshi
Sakshi News home page

ENG Vs IND: లార్డ్స్‌లో టీమిండియా విజయం.. వైరలవుతున్న ట్రోల్స్‌

Published Tue, Aug 17 2021 1:56 PM | Last Updated on Tue, Aug 17 2021 3:44 PM

Trolls And Meems Viral After India Epic Win At Lords Test Vs England - Sakshi

లార్డ్స్‌: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ టాపార్డర్‌ తడబడినప్పటికి భారత టెయిలెండర్లు మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మలు అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ ముందు మంచి లక్ష్యాన్నే నిర్ధేశించారు. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ ​సిరాజ్‌ 4, బుమ్రా 3 దెబ్బకు 120 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో 151 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 

కాగా లార్డ్స్‌ టెస్టు విజయం అనంతరం క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా భారత ప్రదర్శనను మెచ్చకుంటూ ఇంగ్లండ్‌ టీమ్‌ను ఒక ఆటాడుకున్నారు. '' 8 నెలల కాలంలోనే సిడ్నీ.. గబ్బా.. లార్డ్స్‌ టెస్టులో ఘన విజయాలు అందుకున్న టీమిండియాకు ఇది బెస్ట్‌ సీజన్‌.. ఇలాంటి విజయాలు మున్ముందు మరిన్ని చూడాలి..'' అంటూ టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ కామెంట్‌ చేశాడు.

ఇక ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ను టీమిండియా గెలుచుకున్న తర్వాత '' టీమిండియాను తక్కువ అంచనా వేయకూడదు.. అంటూ  ఆ జట్టు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ పలికిన వ్యాఖ్యలను నెటిజన్లు మరోసారి గుర్తు చేశారు. తొలి టెస్టులో వర్షం టీమిండియాను కాపాడిందని మైకెల్‌ వాన్‌ చేసిన కామెంట్స్‌ను దృష్టిలో ఉంచుకున్న అభిమానులు అతన్ని టార్గెట్‌ చేస్తూ.. ''ఇప్పుడేమంటావ్‌ వాన్‌.. నీ నోటికి తాళం పడిందా'' అన్నట్లుగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీటితో పాటు మరికొన్ని మీమ్స్‌ కూడా బాగా వైరల్‌ అయ్యాయి. మీరు ఒక లుక్కేయండి.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement