హార్దిక్ పాండ్యాకు గాయం (PC: BCCI)
ICC Cricket World Cup 2023- India vs Bangladesh: బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. గాయం తీవ్రతను అంచనా వేసేందుకు అతడిని స్కానింగ్ కోసం పంపించారు.
వైద్య పరీక్షల అనంతరమే హార్దిక్ పాండ్యా పరిస్థితిపై అంచనాకు వచ్చే అవకాశం ఉందంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటన విడుదల చేసింది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా పుణె వేదికగా టీమిండియా- బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడుతోంది.
నిలకడగా ఆడిన బంగ్లాదేశ్ ఓపెనర్లు
ఈ సందర్భంగా టాస్ గెలిచిన షాంటో బృందం తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఆది నుంచే ఓపెనర్లు తాంజిద్ హసన్(51), లిటన్ దాస్ (66) నిలకడగా ఆడుతూ జట్టుకు శుభారంభం అందించారు.
ఇదిలా ఉంటే.. బంగ్లా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో బౌలింగ్ చేసేందుకు వచ్చిన హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. పాండ్యా బౌలింగ్లో తొలి మూడు బంతుల్లో లిటన్ దాస్ వరుసగా 0, 4, 4 బాదగా.. స్ట్రెయిట్ డ్రైవ్(రెండో బౌండరీ)ని ఆపేందుకు పాండ్యా విఫలయత్నం చేశాడు.
గాయం కారణంగా..
కుడికాలితో బంతిని అడ్డుకోవాలని చూసి పట్టుతప్పి తన ఎడమకాలిపై పడిపోయాడు. మడిమకు గాయం కావడంతో పాండ్యా మైదానం వీడాడు. దీంతో స్టార్ బ్యాటర్, రైటార్మ్ మీడియం పేసర్ విరాట్ కోహ్లి వచ్చి పాండ్యా ఓవర్ పూర్తి చేయగా.. పాండ్యాను స్కానింగ్ కోసం తీసుకువెళ్లారు.
ఇక... గాయపడ్డ హార్దిక్ పాండ్యా స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్‌కు వచ్చాడు. పాండ్యా తిరిగి బౌలింగ్ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా గనుక గాయం తీవ్రత ఎక్కువై జట్టుకు దూరమైతే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే! ఇక రోహిత్ సేనతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 30 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.
చదవండి: IPL 2024: క్రేజీ.. ఐపీఎల్-2024లో సీఎస్‌కేకు ఆడనున్న సంజూ?
Comments
Please login to add a commentAdd a comment