
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన కోహ్లి (PC: ICC X)
వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వన్డే ఫార్మాట్‌లో దాదాపు ఆరేళ్ల తర్వాత టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి బాల్‌తో రంగంలోకి దిగాడు. వేసిన మూడు బంతుల్లో రెండు పరుగులు ఇచ్చాడు.
అసలేం జరిగిందంటే.. పుణె వేదికగా టీమిండియాతో మ్యాచ్‌తో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బంగ్లా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ సందర్భంగా.. భారత జట్టు సారథి రోహిత్ శర్మ.. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేతికి బంతినిచ్చాడు.
ఈ క్రమంలో పాండ్యా బౌలింగ్‌లో తొలి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయిన లిటన్ దాస్ మరుసటి రెండు బంతుల్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. అయితే, రెండోసారి బౌండరీ దిశగా వెళ్తున్న బంతిని ఆపే క్రమంలో పాండ్యా తన కుడికాలిని అడ్డుపెట్టాడు. ఈ క్రమంలో పట్టుతప్పి జారిపడిపోయాడు.
పాండ్యా నొప్పితో విలవిల్లాడటంతో.. ఓవర్ పూర్తి చేసేందుకు రోహిత్ శర్మ.. కోహ్లిని పిలిచాడు. ఇక పాండ్యా ఓవర్లో మిగిలిన మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు రైటార్మ్ మీడియం పేసర్ కోహ్లి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా వన్డేల్లో ఆఖరిసారిగా.. 2017లో శ్రీలంకతో మ్యాచ్‌లో కోహ్లి బౌలింగ్ చేశాడు.
ఇక వన్డే ప్రపంచకప్ ఈవెంట్ల విషయానికొనిస్తే.. 2011 క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో(0/6 (1)), ఫైనల్లో శ్రీలంకతో(0/6 (1)).. అదే విధంగా 2015 సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో(0/7 (1)) మ్యాచ్‌లో కోహ్లి బంతితో రంగంలోకి దిగాడు. ఇదిలా ఉంటే.. టీమిండియాతో తాజా మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 25 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.
Virat Kohli bowling!!!!
— CSK ARMY 🦁 (@Bikrant51950320) October 19, 2023
Right Arm Quick Bowler in Action 😂🔥#ViratKohli | #WorldCup2023 |#INDvsBAN |#CricketWorldCup2023 | #CricketWorldCup pic.twitter.com/mcQBxHQ3s7