WC 2023 IND Vs NZ: విరాట్‌ కోహ్లి సూపర్‌ ఇన్నింగ్స్‌.. న్యూజిలాండ్‌పై భారత్‌ విజయం | WC 2023, IND Vs NZ : India vs Newzeland Updates And Highlights | Sakshi
Sakshi News home page

WC 2023 IND Vs NZ : విరాట్‌ కోహ్లి సూపర్‌ ఇన్నింగ్స్‌.. న్యూజిలాండ్‌పై భారత్‌ విజయం

Published Sun, Oct 22 2023 2:40 PM | Last Updated on Sun, Oct 22 2023 10:22 PM

WC 2023 IND Vs NZ : India vs Newzeland Updates Highlights - Sakshi

న్యూజిలాండ్‌పై భారత్‌ విజయం...
వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 274 పరుగుల లక్ష్యాన్ని  48 ఓవర్లలో భారత్‌ ఛేదించింది. టీమిండియా విజయంలో విరాట్‌ కోహ్లి కీలక పాత్ర పోషించాడు. 

104 బంతుల్లో 95 పరుగులు చేసిన విరాట్‌ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అతడితో పాటు ఆఖరిలో రవీంద్ర జడేజా(44 బంతుల్లో 39 నాటాట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరితో పాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(46) పరుగులతో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి భారత్‌ చేరుకుంది.

కాగా భారత్‌కు ఇది వరుసగా ఐదో విజయం కావడం విశేషం. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.  న్యూజిలాండ్‌ బ్యాటర్లలలో డార్లీ మిచెల్‌ (130) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు రచిన్‌ రవీంద్ర(75) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లతో చెలరేగగా..  కుల్దీప్‌ యాదవ్‌ రెండు, సిరాజ్‌, బుమ్రా తలా వికెట్‌ సాధించారు.

42 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. భారత విజయానికి 48 బంతుల్లో 36 పరుగులు కావాలి. క్రీజులో విరాట్‌ కోహ్లి(75), రవీంద్ర జడేజా(28) పరుగులతో ఉన్నారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా..
191 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. భారత విజయానికి 82 పరుగులు కావాలి.

విరాట్‌ కోహ్లి హాఫ్‌ సెంచరీ.. 
274 పరుగుల లక్ష్య ఛేదనలో విరాట్‌ కోహ్లి కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. 60 బంతుల్లో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా..
182 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 27 పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌.. శాంట్నర్‌ బౌలింగ్‌లో ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు చేరాడు.

32 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లి(48), రాహుల్‌(27) పరుగులతో ఉన్నారు.

27 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 147/3

27 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లి(26), రాహుల్‌(15) పరుగులతో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
శ్రేయస్‌ అయ్యర్‌(33) రూపంలో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. 

ఆట తిరిగి మళ్లీ ప్రారంభమైంది. 17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లి(9), శ్రేయస్‌ అయ్యర్‌(26) పరుగులతో క్రీజులో ఉన్నారు.

మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన పొగమంచు
ధర్మశాల వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్‌-భారత్‌ మ్యాచ్‌కు పొగ మంచు అంతరాయం కలిగించింది.  టీమిండియా ఇన్నింగ్స్‌ 100/2 పరుగుల వద్ద మ్యాచ్‌ ఆగిపోయింది. క్రీజులో విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నాడు.

రెండో వికెట్‌ డౌన్‌
76 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 26 పరుగులు చేసిన శుబ్‌మన్‌ గిల్‌.. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్‌ అయ్యర్‌ వచ్చాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా..
274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 46 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ.. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్‌ కోహ్లి వచ్చాడు. 12 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 75/1

10 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 63/0
10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(39) దూకుడుగా ఆడుతున్నాడు. అతడితో పాటు శుబ్‌మన్‌ గిల్‌(24) పరుగులతో ఉన్నాడు.

2 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 15/0
274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ(14), శుబ్‌మన్‌ గిల్‌(1) ఉన్నారు.

ఐదు వికెట్లతో చెలరేగిన షమీ..
ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బ్యాటర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో ఈజీగా 300 మార్క్‌ను అందుకునేలా కన్పించిన న్యూజిలాండ్‌ను మహ్మద్‌ షమీ తన అద్భుత బౌలింగ్‌తో కంట్రోల్‌ చేశాడు.

ఈ వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న షమీ.. ఐదు వికెట్లతో చెలరేగాడు. షమీ తన 10 ఓవర్ల కోటాలో 54 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు కుల్దీప్‌ యాదవ్‌ రెండు, సిరాజ్‌, బుమ్రా తలా వికెట్‌ సాధించారు. ఇక న్యూజిలాండ్‌ బ్యాటర్లలలో డార్లీ మిచెల్‌ (130) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు రచిన్‌ రవీంద్ర(75) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

సూపర్‌ షమీ..
మహ్మద్‌ షమీ దెబ్బకు న్యూజిలాండ్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది.  48 ఓవర్‌ వేసిన షమీ.. వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. 48 ఓవర్లకు న్యూజిలాండ్‌ స్కోర్‌: 262/8

ఐదో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌..
గ్లెన్‌ ఫిలిప్స్‌ రూపంలో కివీస్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ఫిలిప్స్‌.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

డార్లీ మిచెల్‌ సూపర్‌ సెంచరీ..
న్యూజిలాండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ డార్లీ మిచెల్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సరిగ్గా 100 బంతుల్లో  తన సెంచరీ మార్క్‌ను మిచెల్ అందుకున్నాడు. 41 ఓవర్లు ముగిసే సరికి కివీస్‌ 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్‌(100), ఫిలిప్స్‌(12) ఉన్నారు.

కుల్దీప్‌ మాయ.. కివీస్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
205 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన టామ్‌ లాథమ్‌.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 37 ఓవర్లకు కివీస్‌ స్కోర్‌: 205/4

సూపర్‌ షమీ.. న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ డౌన్‌
న్యూజిలాండ్‌ ఎట్టకేలకు వికెట్‌ కోల్పోయింది. 75 పరుగులు చేసిన రచిన్‌ రవీంద్ర.. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి టామ్‌ లాథమ్‌ వచ్చాడు. 34 ఓవర్లకు కివీస్‌ స్కోర్‌: 180/3

28 ఓవర్లకు న్యూజిలాండ్‌ స్కోర్‌: 138/2
28 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.  రవీంద్ర(59), డార్లీ మిచెల్‌(57) పరుగులతో క్రీజులో ఉన్నారు.
19 ఓవర్లకు న్యూజిలాండ్‌ స్కోర్‌: 90/2
26 పరుగులకే రెండు వికెట్ల కోల్పోయిన న్యూజిలాండ్‌ను రచిన్‌ రవీంద్ర, డార్లీ మిచెల్‌ అదుకున్నారు. 19 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. రవీంద్ర(39), డార్లీ మిచెల్‌(30) పరుగులతో క్రీజులో ఉన్నారు.

న్యూజిలాండ్‌ రెండో వికెట్‌ డౌన్‌.. 
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. విల్‌ యంగ్‌(17) రూపంలో న్యూజిలాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. యంగ్‌ను మహ్మద్‌ షమీ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 9 ఓవర్లకు న్యూజిలాండ్‌ స్కోర్‌: 26/2

తొలి వికెట్‌ కోల్పోయిన కివీస్‌..
9 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో డెవాన్‌ కాన్వే ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌, టీమిండియా తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది.

ఈ మ్యాచ్‌కు స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. అతడి స్దానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టులోకి రాగా.. శార్థూల్‌ ఠాకూర్‌ స్ధానంలో మహ్మద్‌ షమీ వచ్చాడు. మరోవైపు కివీస్‌ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది.

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్‌), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement