ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఆతిథ్యమిచ్చేందుకు పాకిస్తాన్ సిద్దమవుతోంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత తమ గడ్డపై జరుగుతున్న ఐసీసీ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని విదాల సన్నదమవుతోంది.
భద్రతా కారణాల దృష్టా 1996 వన్డే వరల్డ్‌కప్ తర్వాత పాకిస్తాన్ ఇప్పటివరకు ఐసీసీ టోర్నమెంట్‌కు ఆతిథ్యమివ్వలేదు. ఈ మెగా ఈవెంట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) డ్రాప్ట్ షెడ్యూల్‌ను కూడా ఐసీసీకి సమర్పించింది.
ప్రస్తుతం ఈ షెడ్యూల్ ఐసీసీ పరిశీలనలో ఉంది. అయితే ఈ టోర్నీలో భారత పాల్గోనడంపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే పాకిస్తాన్‌కు తమ జట్టును పంపించేందుకు బీసీసీఐ నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమ నిర్ణయాన్ని బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు తెలియజేసినట్లు సమాచారం.
గత ఆసియాకప్ మాదరిగానే హైబ్రిడ్ మోడల్ నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఐసీసీని కోరినట్లు వినికిడి.
టోర్నీ నుంచి భారత్ వైదొలిగితే..?
ఒకవేళ భారత్ చేసిన ఈ ప్రతిపాదనని అంగీకరించకుండా, పాక్‌లోనే అన్ని మ్యాచ్‌లను నిర్వహించాలని పీసీబీ పట్టుబడితే ఏంటి పరిస్థితి అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
హైబ్రిడ్ మోడల్‌లో కాకుండా పాక్‌లోనే టోర్నీ మొత్తాన్ని నిర్వహించాలన్న పీసీబీ డిమాండ్‌ను ఐసీసీ అంగీకరిస్తే.. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ పాక్‌కు వెళ్లడం కష్టమనే చెప్పుకోవాలి.
ఈ క్రమంలో ఈ మెగా టోర్నీ నుంచి భారత్ వైదొలిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి టీమిండియా తప్పుకుంటే శ్రీలంక అర్హత సాధిస్తోంది.
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లు ఈ టోర్నీకి అర్హత సాధించగా.. 9వ స్థానంలో నిలిచిన శ్రీలంకకు చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే భారత్ తప్పుకుంటే శ్రీలంకకు అవకాశం దక్కుతుంది.
Comments
Please login to add a commentAdd a comment