
PC: IPL.com
టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ మైదానంలోనే కాకుండా ఆఫ్‌ది ఫీల్డ్‌లో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో తన అభిమానులను చాహల్ అలరిస్తుంటాడు. అయితే తాజాగా చాహల్‌కు సంబంధించిన మరో వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
చాహల్ ప్రస్తుతం ఐపీఎల్-2023లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు చాహల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు.. చహల్ ఫన్నీగా డేటింగ్ ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ టీమిండియా చేతిలో ఒక చిన్న పూల కుండీని పట్టుకుని మరీప్రపోజ్ చేశాడు. "జోస్ భాయ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వే నా జీవితం. గతేడాది తొలిసారి మిమ్మల్ని చూసినప్పుడే నేను ప్రేమలో పడిపోయాను. ప్రతిరోజు నాకు గుర్తొస్తూనే ఉంటావు. ప్లీజ్ నాతో డేట్‌కు వస్తారా" అని సరదాగా చహల్ ప్రపోజ్ చేశాడు.
అందుకు బదులుగా బట్లర్ "సరే యుజీ.. నేను కచ్చితంగా వస్తాను" అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో చుట్టుపక్కన వారంతా ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక రాజస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 20న ఆర్సీబీతో తలపడనుంది.
చదవండి: IPL 2023: తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్
IPL 2023: విధ్వంసకర వీరుడొచ్చాడు.. వెలగబెట్టిందేమీ లేదు! పాపం పంజాబ్..
The perfect proposal doesn’t exi- 😂 pic.twitter.com/vENeuVtfTq
— Rajasthan Royals (@rajasthanroyals) April 20, 2023