వృద్ధుల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం | Sakshi
Sakshi News home page

వృద్ధుల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం

Published Sun, May 5 2024 3:00 AM

వృద్ధుల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం

● కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

కొడవలూరు: పింఛన్లు ఇంటి వద్ద అందకుండా చేసి వృద్ధుల ప్రాణాలతో చంద్రబాబు నాయుడు చెలగాటమాడుతున్నాడని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని రేగడిచెలిక, రాచర్లపాడు, పెయ్యలపాళెంలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెయ్యలపాళెంలో మాట్లాడుతూ చంద్రబాబు తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్‌ చేత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించి వలంటీర్లు ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయకుండా నిలిపి వేయించారన్నారు. దీంతో పదుల సంఖ్యలో పింఛన్‌దారులు మృతిచెందారన్నారు. జిల్లాలో పెన్నా, సంగం బ్యారేజీలకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేస్తే ఆయన కుమారుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేశారని తెలిపారు. రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని వారు నమ్మారన్నారు. బాబు పాలనలో వర్షాల్లేక రైతులు అల్లాడిపోయారన్నారు. పెయ్యలపాళెం అరబిందో ఫార్మా అధినేత రామ్‌ప్రసాద్‌రెడ్డి సొంత గ్రామమన్నారు. ఆయన తన నిధులతో ఎన్నో పనులు చేశారన్నారు. గ్రామస్తులకు ఆయన రుణం తీర్చుకొనే అవకాశం వచ్చిందని చెప్పారు. ఓట్లు వేసి నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డిని, అసెంబ్లీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు మాట్లాడుతూ వేమిరెడ్డి దంపతులు ప్రజా సేవే ముఖ్యమంటున్నారని, అలాంటి వారు పార్టీలు ఎందుకు మారారో ప్రజలు ప్రశ్నించాలన్నారు. కార్యక్రమంలో అరబిందో సంస్థ ప్రతినిధి పెనాక గోపీనాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ, సచివాలయాల మండల కన్వీనర్‌లు గంధం వెంకటశేషయ్య, కొండా శ్రీనివాసులురెడ్డి, సర్పంచ్‌లు నల్లావుల శ్రీనివాసులు, పెనాక అనూష, ఎంపీటీసీలు పి.అరుణకుమారి, ఎ.రాజమ్మ, సొసైటీ చైర్మన్లు పెనాక నాగశ్రీనివాసులురెడ్డి, దేవనబోయిన శివకుమార్‌, మాజీ సర్పంచ్‌ పెనాక శారద, నాయకులు పెనాక సుభాష్‌రెడ్డి, అక్కుల్‌రెడ్డి, పెయ్యల రమణయ్య, ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement