సొబగుల సిరి | Sakshi
Sakshi News home page

సొబగుల సిరి

Published Tue, May 7 2024 5:25 AM

సొబగు

సింహపురి

నెల్లూరుకే ఐకాన్‌గా పెన్నా బ్యారేజీ

రూ.కోట్లతో నగర రోడ్ల విస్తరణ, అభివృద్ధి

పెన్నానదిపై మరో కొత్త వంతెన

పెన్నానదికి ఇరువైపుల రిటైనింగ్‌ వాల్‌ పనులు

కార్పొరేట్‌ ఆస్పత్రులను తలదన్నే రీతిలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు

కొత్త టెక్నాలజీతో ఫోర్‌ వే ఫ్లై ఓవర్‌

సర్వేపల్లి, జాఫర్‌సాహెబ్‌ కాలువలపై రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం

ఆహ్లాదకరంగా పార్కుల అభివృద్ధి

దాదాపు 225 ఏళ్ల చరిత్ర కలిగిన సింహపురి.. గడిచిన ఐదేళ్లలో నగర స్థాయి ప్రామాణికంగా సరికొత్త హంగులతో సొబగులు అద్దుకుంటుంది. జిల్లా కేంద్రంగా ఉన్న నెల్లూరులో అభివృద్ధి పేరిట గత పాలకులు రూ.కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. నెల్లూరు నగర అభివృద్ధిపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత ప్రభుత్వ పాలనలో పడకేసిన అభివృద్ధి పనులకు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నగర ఎమ్మెల్యే డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ కొత్త జీవం పోశారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో నగరంలో అభివృద్ది అంతంత మాత్రంగా కొనసాగగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ది పనుల కోసం రూ.వంద కోట్లకు పైగా ఖర్చు పెడుతోంది.

నెల్లూరు (బారకాసు): పినాకిని తీరం సాక్షిగా జిల్లా కేంద్రంలో ప్రగతి పరవళ్లు తొక్కుతోంది. టీడీపీ పాలనలో పలనా పని చేశామని చెప్పుకునేందుకు ఒక్కటంటే.. ఒక్క నిర్మాణం కనిపించదు. నెల్లూరుకే తలమానికం అంటూ స్వర్ణాల చెరువు కట్టపై చేపట్టిన నెక్లెస్‌ రోడ్డు పేరుతో దోపిడీ చేసి.. ఆ పనులు అర్ధంతరంగా వదిలేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక వచ్చిన మా ర్పులను ప్రతి నగర పౌరుడు అంగీకరించాల్సిందే. నెల్లూరుకే ఐకాన్‌గా పెన్నాబ్యారేజీని ఈప్రభుత్వమే పూర్తి చేసింది. కేంద్ర నిధులతో నగరంలోని మినీబైపాస్‌రోడ్డు, రామలింగాపురం జంక్షన్‌ వద్ద రూ.41.88 కోట్లతో అత్యాధునిక టెక్నాలజీతో మహానగరాలకు ధీటుగా 810 మీటర్ల పొడవున ఫ్లైఓవర్‌ వంతెనను నిర్మాణం పూర్తి చేశారు. దీంతో సంవత్సరాలు తరబడి నెలకొన్న వాహనదారుల ట్రాఫిక్‌ కష్టాలు తీరాయి. దశాబ్దాల కాలంగా నగరంలోని సర్వేపల్లి, జాఫర్‌సాహెబ్‌ కాలువులను బాగు చేద్దామని ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రూ.200 కోట్లతో సర్వేపల్లి, జాఫర్‌సాహెబ్‌ కాలువలపై రిటైనింగ్‌ వాల్‌ నిర్మించింది. దశాబ్దాల కాలం నుంచి గుంతలమయంగా ఉన్న నగరంలోని మైపాడు ప్రధాన రహదారిని రూ.9 కోట్లతో 2.7 కి.మీ మేర నాలుగులైన్ల సీసీరోడ్డు గా నిర్మాణం పూర్తి చేశారు. దీంతో ఇటు ట్రాఫిక్‌తో పాటు రోడ్డు ప్రమాదాలకు చెక్‌ పడింది. పెన్నానది ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు మరో కొత్త వంతెన నిర్మాణం సాగుతోంది. పెన్నానదికి వరదలు వస్తే ముంపు ప్రాంతాలను రక్షించేందుకు ఇరువైపుల రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం జరుగుతోంది. ఇక నగరంలో విస్తరించిన ప్రాంతాల్లో కొత్తగా సిమెంట్‌ రోడ్లు, నగర పాలక సంస్థ ఖాళీ స్థలాల్లో పార్కులు ఆహ్లాదకరంగా, సకల సౌకర్యాలతో వార్డు సచివాలయ భవనాలు నిర్మిస్తోంది. డివైడర్‌లో పూ లు, గ్రీనరి మొక్కలు, సెంట్రల్‌ లైటింగ్‌తో ఆహ్లాదకరంగా నగర రోడ్లు కనిపిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇదంతా గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ సాధించి గొప్ప ప్రగతికి ముందడుగుగా చెప్పొచ్చు.

రూ.100 కోట్లతో జంక్షన్ల అభివృద్ధి

గతంలో టీడీపీ పాలనలో సృష్టించిన అనేక కష్టాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెక్‌ పెట్టింది. దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రోడ్ల అభివృద్ధికి నిధులు వెచ్చించి రూపు రేఖలు మార్చారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం సహకరించకపోవడంతో నగరాభివృద్ధి కుంటుపడింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని 12 జంక్షన్లను సుందరంగా అభివృద్ధి చేసేందుకు రూ.100 అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ఓ వైపు రహదారులు, భవనాలు, మరో వైపు నగర పాలక సంస్థ పనలు చేపట్టాయి. నెల్లూరు నగరాభివృద్ధికి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌, మేయర్‌ పొట్లూరి స్రవంతి విశేష కృషి చేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు నగరంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమైంది. వాహనాల సంఖ్య పెరగడంతో రద్దీ పెరుగుతోంది. తరచూ ట్రాఫిక్‌ స్తంభించడంతో పాటు రోడ్డు ప్రమా దాలు జరుగుతున్నాయి. వీటి పనులు పూర్తయితే ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభించనుంది.

రూ.46.60 కోట్లతో 598 పనులు

గడప గడపకు మన ప్రభుత్వం కింద రూ.46.60 కోట్లతో 598 పనులు మంజూరయ్యాయి. వీటిలో రూ.18.93 కోట్లతో 288 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 182 పనులు పురోగతిలో ఉండగా మిగిలిన 128 పనులు ఇంకా జరగాల్సి ఉంది.

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో సమస్యలకు చెక్‌

నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలో నీటి సరఫరా, డ్రైనేజీ, చెత్త సేకరణ, వీధి దీపాల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేకంగా నగర పాలక సంస్థ కార్యాలయ ఆవరణలో నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ 14వ ఆర్థిక సంఘం, జనరల్‌ ఫండ్స్‌, సఫాయి మిత్ర ప్రైజ్‌ మనీ వంటి వివిధ వనరుల నుంచి రూ.8.5 కోట్లతో 10,500 చదరపు అడుగుల్లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

కార్పొరేషన్‌ జనరల్‌ ఫండ్స్‌

2023–24 సంవత్సరానికి పురపాలక సాధారణ నిధుల నుంచి రూ.19.75 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో ఇప్పటికే రూ.4.83 కోట్లతో 67 పనులు పూర్తి చేశారు. రూ.4.83 కోట్లతో 49 పనులు పూరోగతిలో ఉన్నాయి. రూ.5.69 కోట్లకు సంబంధించిన 74 పనులు ప్రారంభం కావాల్సి ఉంది. రూ.4.43 కోట్లుకు సంబంధించిన 40 పనులు టెండర్‌ ప్రక్రియ జరగాల్సి ఉంది. జీఎన్‌టీ రోడ్డు, మినీబైపాస్‌రోడ్డు, స్టోన్‌హౌస్‌పేట, మైపాడురోడ్డు, ముత్తుకూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో దాదాపు 23 కి.మీ మేర రూ.60 లక్షలు వెచ్చించి సెంట్రల్‌ లైటింగ్‌తో మువ్వెన్నెల రంగుల్లో విద్యుత్‌ దీపాలతో కాంతులు విరజిమ్ముతున్నాయి.

ఇండోర్‌ షటిల్‌ కోర్టు, బాస్కెట్‌ బాల్‌ కోర్టు

ఆడ పిల్లల క్రీడాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, నెల్లూరునగరంలోని బీవీఎస్‌ పాఠశాల క్రీడామైదానంలో ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఇండోర్‌ షటిల్‌ కోర్టు, బాస్కెట్‌బాల్‌ కోర్టులను రూ.2.09 కోట్లతో ఏర్పాటు చేశారు.

మౌలిక వసతులు

రహదారులు: నగరంలోని వివిధ ప్రాంతాల్లో గుంతలమయంగా రహదారులను రూ.94.79 కోట్ల వ్యయంతో 100 కి.మీ మేర సీసీ, బీటీ రోడ్లుగా నిర్మించారు.

తాగునీరు: 15వ ఆర్థిక సంఘం నిధులు, నగర పాలక సంస్థ సాధారణ నిధులు రూ.8.04 కోట్లతో 70 కి.మీ మేర తాగునీటి పైపులైన్ల ఏర్పాటు ద్వారా నగరంలోని మారుమూల నివాసాలకు కూడా నీటి సరఫరా.

డ్రైన్లు : నగరంలోని వివిధ ప్రాంతాల్లో రూ.59.82 కోట్ల వ్యయంతో 60 కి.మీ మేర మురుగు నీటి కాలువల నిర్మాణం చేపట్టారు.

పార్కులు: నగర పాలక సాధారణ నిధులు, ఎన్‌సీఏపీ నిధులు రూ.0.67 కోట్లతో నగరంలోని వివిధ పార్కుల అభివృద్ధి, సుందరీకరణ చేశారు. ఆదిత్యనగర్‌, సత్యనారాయణపురంతో పాటు ఇతర ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కులు పిల్లలు, పెద్దలకు ఎంతో అహ్లాదకరంగా ఉన్నాయి.

కమ్యూనిటీ, పబ్లిక్‌ టాయిలెట్లు

రూ.5.5 కోట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ నిధులతో నగరంలోని 64 ప్రాంతాల్లో కమ్యూనిటీ, పబ్లిక్‌ టాయిలెట్లను అత్యాధునికంగా నిర్మాణంతో పాటు పలు టాయిలెట్లను పునః నిర్మించడంతో బహిరంగ మల మూత్ర విసర్జణకు అడ్డుకట్ట పడింది.

సంక్షేమాభివృద్ధిలో నెల్లూరు నగరం టాప్‌

నెల్లూరు (సెంట్రల్‌): గడిచిన ఐదేళ్లలో సంక్షేమాభివృద్ధిలో నెల్లూరు టాప్‌గా నిలుస్తోంది. దాదాపు 33 పథకాల ద్వారా రూ.వేల కోట్లు డీబీటీ, నాన్‌ డీబీటీ కింద లక్షలాది మంది ప్రజలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించింది. ప్రతి కుటుంబానికి రెండు.. నుంచి అంతకు మించిన పథకాలు అందాయి.

నెల్లూరు పెన్నా బ్యారేజ్‌

నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి

షాదీ మంజిల్‌ నిర్మాణం

ప్రజారోగ్యానికి పెద్దపీట

ప్రజల చెంతకే మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచి సకాలంలో మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నారు. ప్రజలు ఎటు వంటి చికిత్సకై నా వెంటనే సమీపంలోని వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.

నగరంలో రూ.10.40 కోట్లతో 13 కొత్త వైఎస్సార్‌ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు మంజూరు చేయగా ఇందులో 12 యూపీ హెచ్‌సీలు పూర్తి కాగా మరో ఒకటి యూపీహెచ్‌సీ చివరి దశలో ఉంది. వీటిని వైద్యశాఖకు అప్పగించారు.

2020–2కి సంబంధించిన 15వ ఆర్థిక సంఘ నిధుల్లో రూ.43.60 కోట్లతో 140 పనులు ప్రతిపాదించగా ఇందులో రూ.16.61 కోట్లు విలువైన 70 పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

2021–22కి సంబంధించి రూ.10.22 కోట్లతో 28 పనులు ప్రతిపాదించగా అందులో రూ.2.92 కోట్లతో 8 పనులు పూర్తి కాగా మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

నగర పాలక సంస్థ పరిధిలోని మైనారిటీలను దృష్టిలో ఉంచుకుని రూ.0.10 కోట్లతో 1078.23 చ.మీ విస్తీర్ణంలో షాదీ మంజిల్‌ (జీ+2) నిర్మించారు. షాదీమంజిల్‌లో పెళ్లిళ్లతో పాటు ఇతర శుభకార్యాలను జరుపుకునేందుకు ప్రజలకు అందుబాటు అద్దె రూ.10 వేలుతో బుకింగ్‌ చేసుకునే సౌలభ్యం కల్పించారు.

సొబగుల సిరి
1/12

సొబగుల సిరి

సొబగుల సిరి
2/12

సొబగుల సిరి

సొబగుల సిరి
3/12

సొబగుల సిరి

సొబగుల సిరి
4/12

సొబగుల సిరి

సొబగుల సిరి
5/12

సొబగుల సిరి

సొబగుల సిరి
6/12

సొబగుల సిరి

సొబగుల సిరి
7/12

సొబగుల సిరి

సొబగుల సిరి
8/12

సొబగుల సిరి

సొబగుల సిరి
9/12

సొబగుల సిరి

సొబగుల సిరి
10/12

సొబగుల సిరి

సొబగుల సిరి
11/12

సొబగుల సిరి

సొబగుల సిరి
12/12

సొబగుల సిరి

Advertisement
 
Advertisement