నేటి నుంచి సింహపురి సాంస్కృతిక ఉత్సవాలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు మూడు రోజుల పాటు ఆంధ్రరాష్ట్ర ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ.. సింహపురి సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌కుమార్ తెలిపారు. నగరంలోని బాలాజీనగర్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు నగరంలోని ముత్తుకూరుగేట్ సెంటర్ వద్ద సాయంత్రం ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి సాంస్కృతిక కళాకారులు వందల సంఖ్యలో వస్తారని, మొదటి రోజు సోమవారం ఈ ఉత్సవాలను ప్రముఖ సినీ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ ప్రారంభిస్తారని, మంగళవారం నిర్వహించే కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసు బ్రమణ్యం పాల్గొంటారని, చివరి రోజు బుధవారం ముగింపు కార్య క్రమానికి తెలంగాణ ఎమ్మెల్సీ, ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న పాల్గొంటారని పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో నిర్వహించే సింహపురి సాంస్కృతిక ఉత్సవాల ఆహ్వాన పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ సమావేశంలో సాంస్కృతిక సబ్‌కమిటీ కన్వీనర్ మంగళ పుల్లయ్య, రెహనాబేగం, విజయ్‌కుమార్, శీనయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment