ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Published Mon, Jan 27 2025 6:52 AM | Last Updated on Mon, Jan 27 2025 6:52 AM

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

అల్లూరు: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్లూరులో జరిగింది. ఎస్సై కిశోర్‌బాబు ఆదివారం వివరాలు వెల్లడించారు. మారుతి కాలనీకి చెందిన తంబి సురేష్‌ (35)కు మద్యం అలవాటు ఉంది. దీంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. శనివారం అతడి భార్య జీవన తన ఇద్దరి పిల్లలను తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. తిరిగి ఇంటికొచ్చేసరికి సురేష్‌ ఉరేసుకుని ఉన్నాడు. జీవన కేకలు వేయగా ఇంటి చుట్టుపక్కల వారు వచ్చి అతడిని అల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అల్లూరు ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement