జాతీయ ఆర్చరీ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ ఆర్చరీ పోటీలకు ఎంపిక

Published Tue, Jan 28 2025 12:20 AM | Last Updated on Tue, Jan 28 2025 12:20 AM

జాతీయ

జాతీయ ఆర్చరీ పోటీలకు ఎంపిక

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లాకు చెందిన ఐదు గురు ఆర్చరీ క్రీడాకారులు ఐదు పతకాలు సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యారని జిల్లా ఆర్చరీ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పల్లంరెడ్డి శ్రీహర్ష, పావురాల వేణు సోమవారం తెలిపారు. విజయవాడలో జరిగిన అంతర్‌ జిల్లాల పోటీల్లో బాలుర రికర్వ్‌ రౌండ్‌లో కె.తరుణేష్‌ జోత్య ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం, ఆర్‌ సాయిమౌర్య సిల్వర్‌ పతకాన్ని సాధించారన్నారు. బాలుర ఇండియన్‌ రౌండ్‌లో జి.వెంకట లోకేష్‌ బంగారు పతకాన్ని, ఏ సాత్విక్‌ బ్రాంజ్‌ మెడల్‌ని, బాలికల ఇండియన్‌ రౌండ్‌లో వై.దీత్యాచండిక బ్రాంజ్‌ మెడల్‌ సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యారన్నారు. జాతీయ పోటీలు ఫిబ్రవరి 10 నుంచి 17 వరకు వెస్ట్‌ బెంగాల్‌లో బోల్‌పూర్‌లో జరుగుతాయని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను కోచ్‌లు శివశంకర్‌, భరద్వాజ్‌, హారతిలు అభినందించారు.

రేపు ఇంటర్‌ పరీక్షలపై

సమన్వయ కమిటీ సమావేశం

నెల్లూరు (టౌన్‌): ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై ఈ నెల 29న కలెక్టర్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఉదయం 11 గంటలకు వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం జరగనున్నట్లు ఆర్‌ఐఓ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం నుంచి స్థానిక స్టోన్‌హోస్‌పేటలోని కేఏసీ జూనియర్‌ కళాశాలలో జిల్లాలోని అన్ని యాజమాన్య ప్రిన్సిపల్స్‌తో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల 1, 3వ తేదీల్లో జరగనున్న నైతిక, మానవీయ విలువలు, పర్యావరణ విద్య పరీక్షలతోపాటు 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒకేషనల్‌ విద్యార్థులు, 10 నుంచి ప్రారంభం కానున్న జనరల్‌ విద్యార్థుల ప్రాక్టికల్స్‌ నిర్వహణకు సంబంధించి అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి పరీక్ష కేంద్రాల ఖరారు, సిబ్బంది నియామకాలను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

హుండీ కానుకలు

లెక్కింపు

నెల్లూరు(బృందావనం): ముక్కోటి ఏకాదశి సందర్భంగా రంగనాయకులపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథస్వామి వారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక క్లాత్‌ హుండీల ద్వారా స్వామి వారికి భక్తులు కానుకల రూపంలో రూ.7,12,789 సమర్పించారని కార్యనిర్వహణాధికారి ఆళ్ల శ్రీనివాసులురెడ్డి తెలిపారు. కానుకలను సోమవారం లెక్కించారు. హుండీ లెక్కింపులో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌ మంచికంటి శ్రీనివాసులు, సభ్యులు వై.మాధవి, వి.పద్మజ, వి.శ్రీనివాసులు, ఈ.దొరస్వామి భక్తులు, విశ్రాంత ఎస్‌బీఐ ఉద్యోగులు, సంతపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లెక్కింపును పూడిపర్తి రామలింగేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్‌.శ్రీధర్‌నాయుడు పర్యవేక్షించారు.

పేదల జోలికొస్తే

సహించేది లేదు

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు (బారకాసు): నెల్లూరు రూరల్‌ పరిధిలో పేద, మధ్య తరగతి ఇళ్లకు వచ్చి కరెంట్‌ కట్‌ చేస్తాం, ఇళ్లు ధ్వంసం చేస్తాం అంటూ బెదిరిస్తే.. సహించేది లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నగర పాలక సంస్థ అధికారులను హెచ్చరించారు. సోమవారం నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జరిగిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో కమిషనర్‌ సూర్యతేజ, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజలు అందజేస్తున్న అర్జీల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మధ్య తరగతి కుటుంబాల విషయంలో చిన్న పొరపాటు జరిగినా తాను సహించేది లేదన్నారు. కొంత మంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, అలాంటి వేషాలు చెల్లవని హెచ్చరించారు. అధికారులు ఎవరి కళ్లల్లోనో ఆనందం కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కానీ తనతో తమాషాలాడొద్దని, ఒక వేళ ఎవరైనా అలా ప్రవర్తిస్తే.. నేను వీధుల్లోకి వచ్చిన రోజు వాళ్లను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
జాతీయ ఆర్చరీ  పోటీలకు ఎంపిక 
1
1/1

జాతీయ ఆర్చరీ పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement