కనికరించండి.. న్యాయం చేయండి
నెల్లూరు(క్రైమ్): ‘క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. మీరైనా కనికరించి న్యాయం చేయండి’ అని పలువురు బాధితులు ఎస్పీ జి.కృష్ణకాంత్‌ను కోరారు. సోమవారం నెల్లూరు ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 80 మంది విచ్చేసి తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీకి అందజేశారు. వాటిని పరిశీలించిన ఆయన చట్టపరిధిలో నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నగర, మహిళా డీఎస్పీలు పి.సింధుప్రియ, చెంచురామారావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ శాఖలో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
80 అర్జీల అందజేత
పరిష్కరిస్తామన్న ఎస్పీ కృష్ణకాంత్
Comments
Please login to add a commentAdd a comment