సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు

Published Thu, Jan 30 2025 12:15 AM | Last Updated on Thu, Jan 30 2025 12:15 AM

సర్పం

సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు

నెల్లూరు (పొగతోట): పంచాయతీ నిధుల ఖర్చుకు సంబంధించి సరైన బిల్లులు లేని కారణంగా, నిధుల దుర్వినియోగం తదితర అంశాలపై చేజర్ల మండలం గొల్లపల్లి సర్పంచ్‌ జయంతి చెక్‌ పవర్‌ను రద్దు చేస్తూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఇచ్చిన షోకాజు నోటీసుకు సంజాయిషీ ఇవ్వకపోవడంతో చెక్‌పవర్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

దళితుల మధ్య చిచ్చు పెట్టిందే చంద్రబాబు

నెల్లూరు రూరల్‌: రాష్ట్రంలో దళితులు, ఓబీసీలు కలిస్తే ఉత్తరప్రదేశ్‌లో మాదిరి అధికారంలోకి వస్తారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అందుకే దళితులు ఏకమవకుండా వారి మధ్య చిచ్చుపెట్టి ఒక వర్గాన్ని చంద్రబాబు తమ వైపు తిప్పుకున్నారని తెలిపారు. దళితులను ఓబీసీలను కూడా కలవనీయకుండా చేసి అధికారాన్ని కాపాడుకుంటున్నారన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్‌ పరం చేయనని మోదీతో చెప్పించాల్సిన బాధ్యత చంద్రబాబుదేనన్నారు. ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు స్థానిక కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.

బీసీ కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్పొరేషన్‌ ద్వారా బ్యాంకు లింకేజీ సబ్సిడీ రుణాలు మంజూరు కోసం ఓబీ ఎంఎంఎస్‌ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ కార్పొరేషన్‌ ఈడీ డాక్టర్‌ ఏ నిర్మలాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి బీసీ, ఈడబ్ల్యూఎస్‌, కాపు, బలిజ ఒంటరి, తెలగ, కులాల్లోని నిరుద్యోగ లబ్ధిదారులు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 7 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. అర్హులైన వారు ఓబీ ఎంఎంఎస్‌ దరఖాస్తులను పంపాలని కోరారు.

టీచర్ల సమాచారాన్ని

అప్‌డేట్‌ చేయాలి

నెల్లూరు (టౌన్‌): జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్లలోని ఉపాధ్యాయులు విద్యాపరమైన, వృత్తి పరమైన సమాచారాన్ని cse. ap. gov. in వెబ్‌సైట్‌లో తమ వ్యక్తిగత లాగిన్‌ ద్వారా అప్‌డేట్‌ చేయాలలని డీఈఓ ఆర్‌.బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 31వ తేదీ వరకు ఎడిట్‌ ఆప్షను ఉంటుందని, సాయంత్రం 5 గంటల ద్వారా క్లోజ్‌ అవుతుందని పేర్కొన్నారు.

పకడ్బందీగా

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు

నెల్లూరు (టౌన్‌): మార్చి 1 నుంచి జరిగే ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్‌ఐఓ ఆదూరు శ్రీనివాసులు తెలిపారు. బుధవారం స్థానిక స్టోన్‌హౌస్‌పేటలోని కేఏసీ జూనియర్‌ కళాశాలలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌తో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 1, 3 తేదీల్లో 187 జూనియర్‌ కళాశాలల్లో నైతిక, మానవీయ విలువలు, పర్యావరణ విద్య పరీక్షలు జరుగుతాయన్నారు. 5వ తేదీ నుంచి ఒకేషనల్‌ ప్రాక్టికల్స్‌ జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలను అందించాలన్నారు. పరీక్షల జిల్లా కమిటీ సభ్యులుగా దీన్‌దయాళ్‌, వేణుగోపాల్‌, కొండయ్య, శ్రీనివాసరావు వ్యవహరిస్తారని చెప్పారు. అనంతరం పరీక్షల సామగ్రిని ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్‌, అధ్యాపకులు, సూపరింటెండెంట్‌ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఐసీడీఎస్‌ ఇన్‌చార్జి పీడీగా గంగాభవాని

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు ఐసీడీఎస్‌ ఇన్‌చార్జి పీడీగా గంగాభవాని బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఐసీడీఎస్‌ పీడీగా పనిచేస్తున్న సుజాత సెలవు వెళ్లడంతో గంగాభవానిని ఇన్‌చార్జిగా నియమించారు. గంగాభవాని ప్రస్తుతం డ్వామా పీడీగా పని చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు 1
1/2

సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు

సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు 2
2/2

సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement