వైద్య వీరరాఘవా.. వరాలియ్యవా.. | - | Sakshi
Sakshi News home page

వైద్య వీరరాఘవా.. వరాలియ్యవా..

Published Thu, Jan 30 2025 12:15 AM | Last Updated on Thu, Jan 30 2025 12:15 AM

వైద్య

వైద్య వీరరాఘవా.. వరాలియ్యవా..

బలిపీఠానికి ఉప్పు, మిరియాలతో అభిషేకం చేస్తున్న భక్తులు

పుష్యమాసంలో వచ్చే బహుళ అమావాస్య (మౌని, చొల్లంగి అమావాస్య) రోజున భక్తుల ఈతి బాధలకు మోక్షం కలిగించేందుకు సాక్షాత్తు విష్ణుమూర్తి భూమిపై వైద్య వీరరాఘవస్వామిగా అవతరించారని, గంగ ఆకాశం నుంచి అమృతంగా మారి భూమిపైకి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున వైద్య వీరరాఘవస్వామిని దర్శించుకుని, గంగమ్మను పూజిస్తే కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. బుధవారం మౌని, చొల్లంగి అమావాస్యను పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని రామ్‌నగర్‌లో వేమాలశెట్టి బావి ప్రాంగణంలో కొలువైన వైద్య వీరరాఘవస్వామిని భక్తులు వేల సంఖ్యలో దర్శించుకున్నారు. కోరికలు ఫలించిన భక్తులు వేమాలశెట్టిబావిలో బెల్లం సమర్పించారు. బలిపీఠం వద్ద తమ కోరికలు నెరవేరాలని ఉప్పు, మిరియాలు సమర్పించారు. వైద్య వీరరాఘవా.. వరాలియ్యవా.. అంటూ వేడుకున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, నెల్లూరు

No comments yet. Be the first to comment!
Add a comment
వైద్య వీరరాఘవా.. వరాలియ్యవా.. 1
1/3

వైద్య వీరరాఘవా.. వరాలియ్యవా..

వైద్య వీరరాఘవా.. వరాలియ్యవా.. 2
2/3

వైద్య వీరరాఘవా.. వరాలియ్యవా..

వైద్య వీరరాఘవా.. వరాలియ్యవా.. 3
3/3

వైద్య వీరరాఘవా.. వరాలియ్యవా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement