● సూపరింటెండెంట్‌పై
విచారణకు విచ్చేసిన డీఐజీ
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావుపై వివిధ ఆరోపణల నేపథ్యంలో ఎట్టకేలకు జైళ్ల శాఖ స్పందించింది. బుధవారం ఆ శాఖ డీఐజీ డాక్టర్ ఎం.వరప్రసాద్ నగరానికి చేరుకున్నారు. మూలాపేటలోని ఏపీ స్టార్స్‌లో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రహస్య విచారణ చేశారు. కొద్దిరోజులుగా ఖైదీల బంధువులు, రిమాండ్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి సూపరింటెండెంట్‌తో మాట్లాడుతున్నట్లు ఫోన్ కాల్స్ లీకై న విషయం తెలిసిందే. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో జైలు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో డీఐజీ సదరు ఆడియోలో ఉన్న వ్యక్తులను పిలిచి విచారణ నిర్వహించి స్టేట్మెంట్లను రికార్డు చేసి, వారి వద్దనున్న ఆడియోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అనంతరం రాజారావు నుంచి వివరణ తీసుకెళ్లినట్లు సమాచారం. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment