250 మంది విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

250 మంది విద్యార్థుల ఎంపిక

Published Wed, Apr 2 2025 12:17 AM | Last Updated on Wed, Apr 2 2025 12:17 AM

250 మంది విద్యార్థుల ఎంపిక

250 మంది విద్యార్థుల ఎంపిక

నెల్లూరు(టౌన్‌): సైంటిఫిక్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌లో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులను ఎంపిక చేశామని జిల్లా సైన్స్‌ అధికారి కరుణాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం చెముడుగుంటలోని జిల్లా సైన్స్‌ కేంద్రంలో విజిట్‌కు సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక, సెకండరీ స్థాయికి సంబంధించి ఎంపిక చేసిన 250 మంది విద్యార్థులు బుధవారం చైన్నెలోని పెరియార్‌ సైన్స్‌ సెంటర్‌, గిండి నేషనల్‌ పార్క్‌, మద్రాస్‌ ఐఐటీ సైన్స్‌ కేంద్రాలను విజిట్‌ చేస్తారన్నారు. ఉదయం 5 గంటలకు విద్యార్థులతోపాటు గైడ్‌ టీచర్లు జిల్లా సైన్స్‌ కేంద్రానికి చేరుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement