18న కేవీకేలో రైతు సదస్సు - | Sakshi
Sakshi News home page

18న కేవీకేలో రైతు సదస్సు

Published Sun, Jun 16 2024 12:14 AM

18న క

బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 18న రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు కేవీకే కో ఆర్డినేటర్‌, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ మల్లేశ్వరి పేర్కొన్నారు. ‘పీఎం కిసాన్‌ సమాన్‌ నిధి’ నిధుల విడుదల సందర్భంగా వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే కార్యక్రమాన్ని రైతులకు వీక్షించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

22న హెచ్‌సీఎల్‌ టెక్‌బీ కెరీర్‌ ప్రోగ్రాంకు ఎంపిక

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభి వృద్ధి సంస్థ ,హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా హెచ్‌సీఎల్‌ టెక్‌బీ కెరీర్‌ ప్రోగ్రాం ద్వారా ఈ నెల 22న అనంతపురం ప్రభుత్వ ఐటీఐ (బాయ్స్‌ ) కళాశాలలో క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. 2023–2024కు 70 శాతం ఉత్తీర్ణత, మ్యాథ్స్‌ లేదా బిజినెస్‌ మ్యాథ్స్‌లో 60 కంటే ఎక్కువ శాతంతో ఇంటర్‌ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులన్నారు. నాన్‌ ఐటీ రంగంలో 2023–2024లో 70 శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణతతో ఇంటనర్‌ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా హెచ్‌సీఎల్‌ టెక్‌బీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఇంటర్మీడియట్‌ 2023–2024లో పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాంపస్‌ డ్రైవ్‌కు రెజ్యూమ్‌ లేదా బయోడేటాతో పాటు ఆధార్‌, సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలు, (పదో తరగతి, ఇంటర్మీడియట్‌), రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు తీసుకుని రావాలన్నారు. వివరాలకు 6363095030, 8555085030 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

నెల్లూరు, చిత్తూరు జట్ల విజయం

అనంతపురం: ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌–23 సౌత్‌ జోన్‌ టోర్నీలో భాగంగా నిర్వహిస్తున్న మ్యాచ్‌ల్లో శనివారం నెల్లూరు, చిత్తూరు జిల్లాల జట్లు విజయం సాధించాయి.

● నెల్లూరుతో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి కర్నూలు బ్యాటింగ్‌ ఎంచుకుంది. 27.3 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన నెల్లూరు జట్టు 23.5 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 125 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.

● చిత్తూరుతో జరిగిన మ్యాచ్‌లో కడప టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంపిక చేసుకుంది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 220 పరుగులు సాధించింది. ఎం.వాసుదేవరాజు 89 బంతుల్లో 50 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్స్‌), విజయరామిరెడ్డి 75 బంతుల్లో (5 ఫోర్లు, 3 సిక్స్‌లు)66 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన చిత్తూరు జట్టు 40.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసి గెలుపొందింది. ధరణి కుమార్‌ 68 బంతుల్లో 57 పరుగులు (నాలుగు ఫోర్లు), రెడ్డి రుషిల్‌ 86 బంతుల్లో 104 పరుగులు (9ఫోర్లు, 6 సిక్స్‌లు) ధాటిగా ఆడి జట్టు విజయానికి కృషి చేశారు.

సెంచరీ హీరో రెడ్డి రుషిల్‌

18న కేవీకేలో రైతు సదస్సు
1/1

18న కేవీకేలో రైతు సదస్సు

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement