ధర్మవరానికి చేరుకున్న సైనికుల బైక్‌ ర్యాలీ - | Sakshi
Sakshi News home page

ధర్మవరానికి చేరుకున్న సైనికుల బైక్‌ ర్యాలీ

Published Mon, Jun 17 2024 12:44 AM

ధర్మవరానికి చేరుకున్న సైనికుల బైక్‌ ర్యాలీ

ధర్మవరం అర్బన్‌: కార్గిల్‌ యుద్ధంలో అమరులైన సైనికుల సేవలను స్మరించుకునేలా ఆర్మీ జవానులు చేపట్టిన బైక్‌ ర్యాలీ ఆదివారం ధర్మవరం మండలం రేగాటిపల్లికి చేరుకుంది.ఇండియన్‌ ఆర్మీ సౌత్‌ డెల్టా ఫైర్‌ ఎక్స్‌పిడిషన్‌ కెప్టెన్‌ ఆదర్శ్‌జమేధ, మనోజ్‌నాయక్‌ నేతృత్వంలో బ్రిగేడియర్‌ అజయ్‌కుమార్‌ ఠాకూర్‌ సారథ్యంలో తమిళనాడులోని ధనుష్‌కోటి నుంచి ర్యాలీ చేపట్టినట్లుగా సైనికులు తెలిపారు. కార్గిల్‌ యుద్ధం ముగిసి నేటికి పాతికేళ్లు అయిందని, ఈ నేపథ్యంలో కార్గిల్‌ అమరుల త్యాగాలను స్మరించుకునేలా లద్ధాఖ్‌ వరకూ 5వేల కిలోమీటర్లు మేర బైక్‌ ర్యాలీ కొనసాగుతుందన్నారు. వచ్చే నెల 9న కార్గిల్‌ యుద్ధ స్మారకాన్ని చేరుకోవడంతో ర్యాలీ ముగుస్తుందని వివరించారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement