సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి - | Sakshi
Sakshi News home page

సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి

Published Mon, Jun 17 2024 12:46 AM

సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి

హిందూపురం టౌన్‌: నూతన సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు డీఈఓ మీనాక్షి సూచించారు. స్థానిక సప్తగిరి డిగ్రీ కళాశాల వేదికగా హిందూపురం డివిజన్‌ భగీరథ ఎడ్యుకేషనల్‌ సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉప్పర (సగర) విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా సాగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డీఈఓ మీనాక్షి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యకు మించిన సంపద ఏదీ లేదన్నారు. నూతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ అధ్యక్షుడు ఆదినారాయణ, అనంతపురం శారద, మాజీ జెడ్పీటీసీ వెంకటరమణ, సప్తగిరి కళాశాల మాజీ సీఈఓ ఈశ్వరరెడ్డి, మహంతీష్‌, రాజశేఖర్‌, కార్యదర్శి ఎల్‌ఐసీ వెంకటేశులు, ట్రెజరర్‌ రామాంజినేయులు, కిష్టప్ప, నాగప్ప, జాయింట్‌ సెక్రటరీ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement