ఏర్పాట్లు పరిశీలిస్తున్న రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
కాశీబుగ్గ: సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జిల్లా పర్యటన ఖరారైన నేపథ్యంలో సభాస్థలి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కిడ్నీ ఆస్పత్రి ప్రా రంభం అనంతరం ఆయన బహిరంగ సభలో పాల్గొననుండడంతో పలాస రైల్వే స్టేషన్ ఆవరణలోని క్రీడా మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సోమవారం పనులు పరిశీలించారు. 14వ తేదీన సీఎం రానుండడంతో రహదారితో పాటు పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రం చేస్తున్నారు. ఎస్పీ రాధిక సైతం సోమవారమంతా పలాస–కాశీబుగ్గ మున్సి పాలిటీలోనే గడిపారు. కిడ్నీ ఆస్పత్రిని అన్ని శాఖల అధికారులు పర్యవేక్షించి ఏర్పాట్లకు సంబంధించిన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
కంచిలి: మండలంలోని మకరాంపురంలో ఈ నెల 14వ తేదీన ఉద్దానం వాటర్ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను ప్రారంభించడానికి సీఎం వైఎస్ జగన్ వస్తున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ సోమవారం పరిశీలించారు. వాటర్ ప్రాజెక్టు వద్ద పనుల్ని పరిశీలించిన ఆయన అనంతరం అంపురం వద్ద సీఎం జగన్ దిగడానికి నిర్మిస్తున్న హెలీప్యాడ్ పనుల్ని కూడా పరిశీలించి ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడారు. పర్యటనలో పలాస ఆర్డీఓ భరత్‌నాయక్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జాన్ సుధాకర్, స్థానిక తహసీల్దార్ ఎస్.హైమావతి, ఎంపీడీఓ ఎం.ఈశ్వరరావు, మిగతా సిబ్బంది పాల్గొన్నారు.
హెలీప్యాడ్ స్థలం పరిశీలన
కాశీబుగ్గ: సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఎస్పీ రాధిక పలాసలో పలు ప్రాంతాలు పరిశీలించారు. పలాస పాత జాతీయ రహదారికి ఆనుకుని ఇండస్ట్రీయల్ ఎస్టేట్ ఎదురుగా ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్ సమీపాన కొత్తగా హెలీ ప్యాడ్ నిర్మించాలని సూచించారు. ముందు ఓ స్థలాన్ని ఎంపిక చేసినా తాజాగా దాన్ని మార్చారు. ఈ కార్యక్రమానికి ముందు ఎస్పీ కంచిలి మండలం మఖరాంపురం గ్రామంలో మంచినీటి ప్రాజెక్టు ప్రారంభ స్థలం, అక్కడి హెలీప్యాడ్, పలాస కిడ్నీ ఆస్పత్రి, పలాస రైల్వేక్రీడా మైదానంలో సభా స్థలి పరిశీలించారు. పలాస కిడ్నీ ఆస్పత్రిలో కాశీబుగ్గ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ నవీన్ కుమార్‌లతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, సీఐలు, ఎస్‌ఐలు, స్పెషల్ పార్టీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment