శ్రీకాకుళం | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Published Sat, May 25 2024 3:00 PM

శ్రీక

శనివారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2024
క్షీర సాగర మథనం నిర్విఘ్నంగా పూర్తి కావడానికి శ్రీమహావిష్ణువు కూర్మరూపంలో అవతరించగా.. ఆ రూపాన్ని మరెక్కడా లేని తీరులో మూలవిరాట్టుగా ప్రతిష్టించి అర్చిస్తున్న విశిష్టత మన జిల్లాలో గోచరిస్తుంది. ఆధ్యాత్మిక భావానికి పరాకాష్టగా కూర్మనాథుడి ఆరాధనను చెప్పుకుంటే.. ఈ కాలంలో అందుకు ఏమాత్రం తీసిపోని మరో మానవీయ సేవ తీరప్రాంతంలో నిర్విఘ్నంగా సాగిపోతోంది. అరుదైన ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల సంతతిని పరిరక్షించడానికి.. వాటి గుడ్లను సేకరించి.. ప్రత్యేకించి పొదిగించి.. మళ్లీ సముద్రంలో లక్షలాది చిరుజీవులను విడిచిపెట్టే గొప్ప ప్రయత్నం నిరతం సాగుతోంది. అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్‌ చేస్తున్న ఈ మంచి ప్రయత్నం సముద్రం చేయూతతో ప్రశంసనీయ రీతిలో నడుస్తోంది.

కాశీబుగ్గలో భారీ చోరీ

కాశీబుగ్గ రోటరీనగర్‌లో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు రూ.45 లక్షల విలువైన సొత్తును దొంగలు పట్టుకుపోయారు.

8లో

ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సేకరించిన గుడ్లు

1,59,275

ఇప్పటి వరకు సాగరంలోకి విడిచిపెట్టిన

తాబేళ్లు: 95,696

ఒక్కో తాబేలు పెట్టే గుడ్ల సంఖ్య: 30 నుంచి 140

పొదిగే కాలం: 45 నుంచి 70 రోజులు

28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద

పొదిగిన పిల్లలు మగ తాబేళ్లుగా పరిగణిస్తారు.

30-32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొదిగిన

పిల్లలు ఆడ తాబేళ్లుగా పరిగణిస్తారు.

సంరక్షణకు

పనిచేస్తున్న

వలంటీర్లు: 41

జిల్లా వ్యాప్తంగా

తాబేళ్ల సంరక్షణ కేంద్రాలు:

16

వె

సి

కడలి మమకారం..

మనిషి సహకారం..

వజ్రపుకొత్తూరు రూరల్‌:

ముద్ర జీవుల్లో అరుదైన ఉభయచర జీవులు ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు. ఇవి పసిఫిక్‌ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం వరకు కనిపిస్తూ ఉంటాయి. జపాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, వెనిజూలా, గల్ఫ్‌ తదితర 80 దేశాలతో పాటు మనకు వేల నాటికల్‌ మైళ్ల దూరంలో గంగమ్మ ఒడిలో ఒదిగి ఉంటున్నాయి. తమ సంతతిని వృద్ధి పరిచే లక్ష్యంతో తీరానికి లక్షల సంఖ్యలో చేరుకుంటాయి. మాతృత్వాన్ని పొందేందుకు ప్రకృతిని(తీరాన్ని) ఆవాసాలుగా మార్చుకుంటాయి. అలాంటి ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల సంతతికి శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరం పుట్టినిళ్లుగా నిలుస్తోంది.

భద్రంగా కాపాడుతూ..

జిల్లాలో 193 కి.మీ. విశాల సముద్ర తీరం ఉండ టంతో ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు తమ సంతతి సంరక్షణకు నిలయంగా మార్చుకుంటున్నాయి. వీటికి అటవీ అధికారులు, ట్రీ ఫౌండేషన్‌ ప్రతినిధులు రక్షణగా నిలుస్తున్నారు. జిల్లాలో 16 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి జీవం పోస్తున్నారు. 41 మంది వలంటీర్లను నియమించి వారి ద్వారా గుడ్లు సేకరిస్తున్నా రు. తల్లి తాబేళ్లు ఇసుక తిన్నెలలో పెట్టిన గుడ్లు పక్షులు, జంతువులు, దొంగల బారిన పడకుండా భద్రపరుస్తున్నారు. తీరంలో ఏర్పాటు చేసిన హేచరీలలో గుడ్లును పొదిగించి బుల్లి తాబేళ్లను సురక్షితంగా సముద్రంలో విడిచిపెడుతున్నారు.

సంరక్షణ కేంద్రాలు ఎక్కడెక్కడ..

●జిల్లా వ్యాప్తంగా 16 హ్యాచరీలు(తాబేళ్ళ సంరక్షణ కేంద్రాలు )ఉన్నాయి.

వజ్రపుకొత్తూరు సెక్షన్‌: వజ్రపుకొత్తూరు, మెట్టూరు

బారువ సెక్షన్‌: కళింగపట్నం, గడ్డివూరు, బట్టిగల్లూరు, బారువ, ఇసుకవానిపాలెం

కవిటి సెక్షన్‌: డొంకూరు, చేపల కపాసుకుద్ది, బట్టివానిపాలెం

శ్రీకాకుళం సెక్షన్‌: కొచ్లెర్ల, గంగులవానిపేట

టెక్కలి సెక్షన్‌: గుల్లవానిపేట, కుముందివానిపేట, మేఘవరం, భావనపాడు

అరుదైన జాతిని కాపాడుకుందాం

సముద్ర జీవులలో అరుదైన ఆలివ్‌రిడ్లే తాబేళ్ల రక్షణ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. రాత్రి వేళల్లో తీరం వెంబడి తిరుగుతూ వలంటీర్ల సహకారంతో గుడ్లను సేకరించి సంరక్షిస్తున్నాం. పొదిగిన బుల్లి తాబేళ్లను అటవీ శాఖా అధికారులు సహాయంతో మళ్లీ సముద్రంలోకి విడిచిపెడుతున్నాం.

– కె.సోమేశ్వరరావు, ట్రీ ఫౌండేషన్‌ జిల్లా కో ఆర్డినేటర్‌

న్యూస్‌రీల్‌

అద్భుత ప్రయాణం.. ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల ప్రస్థానం జిల్లాలో 16 హ్యాచరీలతో అరుదైన జాతి సంరక్షణకు యత్నం 1,59,275 గుడ్లు సేకరణ.. సాగరంలోకి 95,696 చిట్టి తాబేళ్లు

పక్కాగా సంరక్షణ

తీరంలో తాబేళ్లు పొదిగిన గుడ్లను ఎలుగులు, నక్కలు, పక్షులు తినకుండా ట్రీ ఫౌండేషన్‌, యువకులు, మత్స్యకారుల సహకారంతో సంరక్షిస్తున్నాం. అరుదైన తాబేళ్ల జాతిని కాపాడుతున్నాం. ఇప్పటికే వేల సంఖ్యలో బుల్లి తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టాం.

– మురళీకృష్ణనాయుడు, అటవీ శాఖాధికారి, కాశీబుగ్గ రేంజ్‌

శ్రీకాకుళం
1/8

శ్రీకాకుళం

శ్రీకాకుళం
2/8

శ్రీకాకుళం

శ్రీకాకుళం
3/8

శ్రీకాకుళం

శ్రీకాకుళం
4/8

శ్రీకాకుళం

శ్రీకాకుళం
5/8

శ్రీకాకుళం

శ్రీకాకుళం
6/8

శ్రీకాకుళం

శ్రీకాకుళం
7/8

శ్రీకాకుళం

శ్రీకాకుళం
8/8

శ్రీకాకుళం

Advertisement
 
Advertisement
 
Advertisement