బెంతొరియాల సమస్యలు పరిష్కరించండి
● శాసన మండలిలో ఎమ్మెల్సీ
నర్తు రామారావు
కంచిలి: ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లో ఉంటున్న 25 వేల మంది బెంతొరియా సామాజిక వర్గానికి చెందిన ప్రజల సమస్యలను పరిష్కరించాలని శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడు నర్తు రామారావు కోరారు. శాసన మండలి బడ్జెట్ సమావేశాల్లో స్పెషల్ మెన్షన్ అవర్‌లో ఈ అంశాన్ని బుధవారం ఆయన ప్రస్తావించారు. బ్రిటిష్ కాలం నుంచి ఎస్టీలుగా గుర్తింపు పొందిన బెంతొరియాలు ప్రస్తుతం సామాజికవర్గ సమస్యతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. వీరంతా ఏ కులానికి చెందినవారో, ఏ ప్రాంతానికి చెందినవారో అనేది గుర్తింపు లేకపోవడం బాధాకరమన్నారు. 1973 నుంచి 76 వరకు, 1981 నుంచి 88 వరకు, 1999 నుంచి 2003 వరకు ఆయా ప్రభుత్వాలు బెంతొరియాలను ఎస్టీలుగా గుర్తించాయని, ఆ సర్టిఫికెట్లతో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో కొలువుదీరారని తెలిపారు. కానీ ప్రస్తుతం బెంతొరియాలకు సర్టిఫికె ట్లు మంజూరు చేయడం లేదని, దీంతో ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని చాలా మంది విద్యార్థులు తమ ఉన్నత చదువులకు ఇబ్బందులు పడుతున్నా రని సభ దృష్టికి తీసుకొచ్చారు. సుమారు పాతిక వేల మంది సమస్యకు పరిష్కారమయ్యే మార్గాన్ని ఈ చట్టసభ ద్వారా చూపించాలని విన్నవించారు. 380 రోజులుగా బెంతొరియా పౌరులు కవిటి మండల కేంద్రంలో రిలే దీక్షలు చేస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment