● పల్లె రహదారుల్లో యూజర్‌ చార్జీల బాదుడు ● టోల్‌గేట్ల మాదిరిగా గ్రామీణ రోడ్లపైనా వసూలు ● ప్రైవేటు వ్యక్తులకు నిర్వహణ అప్పగింత ● జిల్లాలో మూడు రాష్ట్ర హైవేల్లో కొత్తగా టోల్‌ప్లాజాలు ● గుంతలు పూడ్చడానికి తప్పదంటున్న సీఎం చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

● పల్లె రహదారుల్లో యూజర్‌ చార్జీల బాదుడు ● టోల్‌గేట్ల మాదిరిగా గ్రామీణ రోడ్లపైనా వసూలు ● ప్రైవేటు వ్యక్తులకు నిర్వహణ అప్పగింత ● జిల్లాలో మూడు రాష్ట్ర హైవేల్లో కొత్తగా టోల్‌ప్లాజాలు ● గుంతలు పూడ్చడానికి తప్పదంటున్న సీఎం చంద్రబాబు

Published Thu, Nov 21 2024 12:27 AM | Last Updated on Thu, Nov 21 2024 12:27 AM

● పల్

● పల్లె రహదారుల్లో యూజర్‌ చార్జీల బాదుడు ● టోల్‌గేట్ల మ

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

సంపద సృష్టిస్తా.. అని ఎన్నికల్లో చంద్రబాబు చెబుతుంటే ప్రజలు నమ్మారు. ఆయన దగ్గర ప్రత్యేక ప్లాన్లు ఉన్నాయేమో అని అనుకున్నారు. తనకున్న అనుభవంతో సంపద సృష్టిస్తారేమో అని భావించారు. కానీ, రోజుల గడుస్తున్న కొద్దీ జనాలకు అర్థమవుతోంది. చంద్రబాబు సంపద సృష్టించడమంటే ప్రజలపై భారం మోపడమని.. తన దగ్గర ప్రత్యేక మంత్రదండం లేదని, ప్రజల నుంచి వసూలు చేసి, ఖర్చు పెట్టడమే సంపద సృష్టి అని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచనని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి ట్రూ అప్‌, సర్దుబాటు పేరుతో విద్యుత్‌ చార్జీలు పెంచేశారు. ఇప్పుడు రోడ్లు అభివృద్ధి చేయాలంటే యూజర్‌ చార్జీలు వసూలు చేయకతప్పదని చంద్రబాబు తన మనసులో మాట తాజాగా బయటపెట్టేశారు.

పీపీపీ మోడల్‌ పేరిట బాదుడు..

రోడ్లు అభివృద్ధి చేయడానికి నిధుల్లేవని చెప్పి పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) మోడల్‌ను ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు రోడ్ల అభివృద్ధిని అప్పగించి, వారికే ఆ రోడ్లపై యూజర్‌ చార్జీల రూపంలో టోల్‌ వసూలు చేసే బాధ్యతను కట్టబెడుతున్నారు. అంటే, ఇప్పటివరకు జాతీయ రహదారులపైన ఉంటే టోల్‌ప్లాజాలు పల్లె రోడ్లపై కూడా ఏర్పాటు కానున్నాయి. ఇక, ఆ రోడ్ల మీదుగా వెళ్లే ప్రతీ ఒక్కరూ టోల్‌ కట్టాల్సిందే. గ్రామాల నుంచి గ్రామాలకు వెళ్లాలన్నా చెల్లింపు తప్పనిసరి కానుంది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో రోడ్లు భవనాల శాఖ పరిధిలో 27 రహదారులను గుర్తించి.. ఆయా రోడ్లను ప్రైవేటు భాగస్వామ్యంతో మరమ్మతులు, అభివృద్ధి చేస్తూ.. ఆయా రహదారుల్లో కొత్తగా టోల్‌ప్లాజాలను ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నారు. అందులో మన జిల్లాకు సంబంధించి మూడు రహదారులు ఉన్నాయి.

ప్రతిపాదిత

చిలకపాలెం–

రామభద్రపురం

స్టేట్‌ హైవే

మూడుచోట్ల కొత్త టోల్‌ ప్లాజాలు..

●జిల్లాలో చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌16), నరసన్నపేట–పర్లాఖిమిడి (ఎన్‌హెచ్‌ 326ఎ)జాతీయ రహదారుల్లో ఇప్పటికే టోల్‌ప్లాజాలు నడుస్తున్నాయి.

●అంతరాష్ట్ర సర్వీసులు వెళ్లే ప్రధాన సరిహద్దు మార్గాలు కావడంతో ఇక్కడ రహదారుల విస్తరణ నేపథ్యంలో టోల్‌ వసూళ్లు కొన్నేళ్ల నుంచి జరుగుతున్నాయి.

●అయితే ఎన్నడూ లేని విధంగా పొరుగు జిల్లాల సరిహద్దు ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని మూడు రాష్ట్ర రహదారుల్లో కూడా టోల్‌ప్లాజాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

●జిల్లాలో చిలకపాలెం–రాజాం–రామభద్రపురం (130.20 కి.మీ) రోడ్డు, కళింగపట్నం–శ్రీకాకుళం– పార్వతీపురం (సీఎస్‌పీ రోడ్డు 113.30 కి.మీ) రోడ్డు, గార–అలికాం– బత్తిలి (84.80 కి.మీ) రోడ్లను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి యూజర్‌ చార్జీలను వసూలు చేయనుంది. వాస్తవానికి ఈ మూడు రోడ్ల పరిధిలో వందలాది గ్రామాలు, పదుల సంఖ్యలో పట్టణ ప్రాంతాలున్నాయి.

●గతంలో విశాఖపట్నం, ఇచ్ఛాపురం, పర్లాఖిమిడి వెళ్తేనే టోల్‌ బాదుడుండేది.. ఇప్పుడు జిల్లాలో సరిహద్దు ప్రాంతాలకు వెళ్లాలన్నా.. రాజాం, పాలకొండ, గార, కళింగపట్నం, హిరమండలం, కొత్తూరు, బత్తిలి తదితర ప్రాంతాలకు వెళ్లాలన్నా టోల్‌ బాదుడు తప్పదు.

గతమంతా దుష్ప్రచారం..

ప్రతిపక్షంలో ఉన్నంతకాలం ఎక్కడా రోడ్లు బాగోలేవంటూ ఊదరగొట్టిన చంద్రబాబు అండ్‌కో ఇప్పుడవే రోడ్లు చూపించి, వాటిని అభివృద్ధి చేయాలంటూ ప్రజల జేబులకు చిల్లులు పెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో రోడ్లు వేయకుండా ప్రైవేటు వ్యక్తులకు బాధ్యతలు అప్పగించి, వారికే టోల్‌ వసూలు చేసే అధికారం కట్టబెడితే కచ్చితంగా లక్షలాది మందిపై టోల్‌ భారం పడుతుంది. ఈ టోల్‌ప్లాజాల్లో కార్లు, జీపులతో పాటు ఆర్టీసీ బస్సుల నుంచి కూడా టోల్‌ వసూళ్లు చేస్తారు. ఇప్పటికే నాలుగు చక్రాల వాహనాల్లో కార్లకు రూ.150 వరకు, లారీలకు రూ.250, బస్సులకు కూడా ప్రత్యేక రేట్లతో వివిధ టోల్‌ ప్లాజాల వద్ద వసూలు చేస్తున్నారు. ఇదే విధానంతో కొత్త టోల్‌ వసూళ్లు బాధ్యతలు ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్లనున్నాయి. ఇదే జరిగితే దారి దోపిడీ తప్పదు. అంతేకాకుండా రవాణా చార్జీలపై కూడా ప్రభావం పడనుంది. ఆర్టీసీ చార్జీలు, రవాణా (కార్గో) చార్జీలను పెంచేందుకు అవకాశం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
● పల్లె రహదారుల్లో యూజర్‌ చార్జీల బాదుడు ● టోల్‌గేట్ల మ1
1/2

● పల్లె రహదారుల్లో యూజర్‌ చార్జీల బాదుడు ● టోల్‌గేట్ల మ

● పల్లె రహదారుల్లో యూజర్‌ చార్జీల బాదుడు ● టోల్‌గేట్ల మ2
2/2

● పల్లె రహదారుల్లో యూజర్‌ చార్జీల బాదుడు ● టోల్‌గేట్ల మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement