గంజాయితో ముగ్గురు అరెస్టు
ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి అక్రమంగా గంజా యిని తరలించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. సీఐ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఒడిశా రాష్ట్రం నూతన్గఢ్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు సనా కరాడ్, మునా కరాడ్ 3 కేజీల 200 గ్రాముల గంజాయిని తీసుకువచ్చి ఎల్సీ గేట్ వద్ద మహా రాష్ట్రకు చెందిన పర్జానా హసన్ సయ్యద్ అనే మహిళకు ఇస్తుండగా రూరల్ పోలీసులకు పట్టుకున్నారని తెలిపారు. వీరి వద్ద నుంచి గంజాయి, మూడు సెల్ ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వంశధార.. కన్నీటి ధార
గార: నదిలో సరదాగా గడుపుదామని వెళ్లిన వారిని మృత్యువు మింగేసింది. కళ్లే ముందే ఇద్దరి ఊపిరిని ఆపేసింది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు మేరకు.. మండలంలోని కళింగపట్నం పంచాయతీ చిన్నపల్లిపేట గ్రామానికి చెందిన పొట్నూరు కృష్ణ చైతన్య (29) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ప్రస్తు తం గ్రామంలోనే ఉంటున్నాడు. ఆదివారం కా వడంతో అదే పంచాయతీ యాతపేట గ్రామానికి చెందిన తన స్నేహితుడు ముంత దేవీప్రసాద్ (20)తో కలిసి సమీపంలో సంత తోట రేవు వద్దకు స్నానానికి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన మరో ఐదుగురు కూడా వీరికి జత కలిశారు. నదిలో అందరూ సరదాగా స్నానం చేస్తుండగా సాఫ్ట్వేర్ ఉద్యోగి కృష్ణచైతన్య అలా లోపలకు వెళ్లిపోసాగాడు. దీన్ని గమనించిన స్నేహితుడు దేవీప్రసాద్ ఒడ్డుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. ఆ ప్రాంతమంతా మెత్తటి ప్రాంతం కావడంతో కృష్ణచైతన్య కూరుకుపోతున్నా కాపాడలేక దేవీ ప్రసాద్ కూడా అదే ప్రాంతంలో చిక్కుకుపోయాడు. దూరంగా ఉన్న యువకులు కాపాడే ప్రయత్నం చేసి సమీపంలోని సంతతోటలోని పీహెచ్సీ వద్దకు చేర్చారు. కానీ అక్కడి వైద్య సిబ్బంది పరిశీలించేసరికి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణచైతన్య తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ ఆర్.జనార్ధన్ తెలిపారు. మృతదేహాలను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment