గలీజ్ గబ్బు
ఎక్సైజ్‌లో
ఎవరికెళ్లాయి..?
ఈ వసూళ్లకు మొత్తం సూత్రధారి, పాత్రధారి ఎవరు అన్నదానిపైనే చర్చ నడుస్తోంది. ఈ సొమ్ము అంతా ఎక్కడికి వెళ్లింది? ఎవరి ఆదేశాల మేరకు వసూళ్లకు తెగబడ్డారు? ఉన్నత స్థాయిలోనా, ఉత్తరాంధ్ర స్థాయిలోనా, జిల్లా స్థాయిలోనా అన్న చర్చ అంతటా నడుస్తోంది. అంతేకాదు ఏ స్థాయిలో ఎవరికెంత ముట్టింది తదితర వాటిపై ప్రస్తుత మద్యం ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తిరుపతినాయుడును ‘సాక్షి’ వివరణ కోరగా రెన్యువల్ ఫీజులు తప్ప అనధికార వసూళ్లు చేసినట్టుగా తన దృష్టికి రాలేదని చెప్పారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం పాలసీతో దండిగా సంపాదించుకోవచ్చని వ్యాపారులు కలలు కన్నారు. నయానోభయానో షాపులు దక్కించుకున్నారు. కానీ కమీషన్ల విషయంలో ముందు చెప్పిన మాటను చంద్రబాబు అమలు చేయకపోవడంతో మద్యం వ్యాపారులకు చుక్కలు కనబడుతున్నాయి. ఆశించిన లాభాలు రావడం లేదని లబోదిబోమంటున్నారు. టర్నోవర్ పెరిగితే కొంతైనా కవర్ చేసుకోవచ్చని బెల్ట్‌షాపులపై దృష్టి పెట్టారు. ఈ సమయంలో వ్యాపారుల నెత్తిన ఎకై ్స జ్ వాళ్లు భారం మోపారు. లీజు రెన్యువల్ ముసుగులో అనధికార వసూళ్లకు తెగబడ్డారు. షాపుకి రూ.2 లక్షలు చొప్పున డిమాండ్ చేశారు. తమకు అంత వ్యాపారం జరగడం లేదని సంప్రదింపుల తర్వాత కొంతమేరకు తగ్గారు. షాపు విక్రయాల సామర్థ్యం మేరకు వసూళ్లకు ఒప్పందం చేసుకున్నారు. రూ.50వేల దగ్గరి నుంచి రూ.2లక్షల వరకు ముడుపులు ముట్టజెప్పుకున్నారు. ఇదంతా పండగ ముందే జరిగిపోయింది.
లాభాల్లేవని నిరాశ పడుతున్న వేళ..
మద్యం వ్యాపారమంటేనే అటు వ్యాపారులకు, ఇటు ఎకై ్సజ్ వాళ్లకు పండగ. ఒకప్పుడు అంత వైభవంగా జరిగేది. ఇరువర్గాలకు డబ్బులే డబ్బులు. గత ఐదేళ్లలో ప్రభుత్వమే మద్యం షాపులు నడవ డంతో ప్రైవేటు వ్యక్తులకు అవకాశం లేకుండా పో యింది. బయట నుంచి వచ్చే ముడుపులను ఎకై ్సజ్ అధికారులు కోల్పోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు మద్యం వ్యాపారానికి రెక్కలు వ చ్చాయి. ఆదాయమే ప్రధానంగా భావించిన కూట మి ప్రభుత్వం తమకు అలవాటైన రీతిలో మద్యం దుకాణాల కోసం టెండర్లు పిలిచింది. ఆ టెండర్ల ప్రక్రియలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. షాపులు ఎవరికి దక్కినా చివరకు అధికార పార్టీ నాయకులు, సిండికేట్ల చేతికే చిక్కాయి. గతంలో చూసిన లాభాల దృష్ట్యా కొన్నిచోట్ల బెదిరింపులతో, మరికొన్ని చోట్ల గుడ్‌విల్ ఇచ్చి తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. అంతా కొలిక్కి వచ్చింది. దుకాణా ల ఏర్పాటు, విక్రయాలు ప్రారంభమైపోయాయి. కానీ అనుకున్నంత లాభాలైతే వ్యాపారులకు రాలే దు. వారికొచ్చే కమిషన్ ప్రభుత్వం ఆశించినంతగా ఇవ్వకపోవడంతో మద్యం వ్యాపారం బాగోలేదని దాదాపు నిరాశకు గురయ్యారు. ఇదంతా ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఏదొకటి చేద్దాంలే అని ప్రభుత్వ పెద్దలు పరోక్షంగా చెప్పడం, అదే సమయంలో బెల్ట్‌షాపులకు స్వేచ్ఛ నివ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఎకై ్సజ్ బాదుడు..
లైసెన్సురెన్యువల్ ఫీజుతోపాటు తమ ‘ఫీజు’ కూడా చెల్లించాలని ఎకై ్సజ్ అధికారులు వ్యాపారుల ముందు డిమాండ్ చేశారన్న వాదనలు ఉన్నాయి. ఆ బా ధ్యతను సర్కిల్ పరిధిలో ఒక అధికారికి, వ్యాపార వర్గాల నుంచి ఒకరికి అప్పగించారు. జిల్లాలో దా దాపు 158 మద్యం షాపులు ఉన్నాయి. ఈ లెక్కన షాపుల విక్రయాల సామర్థ్యం మేరకు ఎవరి నుంచి ఎంత వసూలు చేశారో వారికే ఎరుక. ఉదాసీనంగా ఉండాలంటే ముడుపులు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టడంతో ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది.
ఎకై ్సజ్ సిబ్బంది అక్రమ వసూళ్లు
రెన్యువల్ ఫీజుతో ముడుపులు సమర్పించుకున్న వ్యాపారులు
తొలుత షాపుకి రూ.2 లక్షలు డిమాండ్..
జిల్లాలో రూ.50వేల నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు
వసూళ్ల సొమ్ము ఎక్కడికెళ్లిందని మద్యం ట్రేడ్ వర్గాల్లో చర్చ
Comments
Please login to add a commentAdd a comment