మార్చి నెలాఖరు నాటికి అందుబాటులోకి..
జిల్లాలో మొత్తం 30 మండలాల్లోని 912 గ్రామ పంచాయతీల్లో 690 చోట్ల ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే మండలానికి గరిష్టంగా 5 షెడ్లలోనే పూర్తి స్థాయిలో వర్మీ జనరేషన్ జరుగుతున్నట్లుగా అధికారిక సమాచారం. దీన్ని బట్టి కేవలం 150 చోట్ల మాత్రమే వర్మీ కంపోస్టు జరుగుతున్నట్లుగా చెప్పవచ్చు. దీంతో పెద్దగా ఆదాయం రావడం లేదని అధికారులు గుర్తించారు. దీంతో పాటు చాలా చోట్ల షెడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండిపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయాయి. ఇదిలావుంటే పోలీసులు కూడా చాలా చోట్ల ఈ షెడ్ల వద్దనే పేకాట, మందుబాబులను పట్టుకున్న సందర్భాలు బోలెడు ఉన్నాయి. వీటి పర్యవేక్షణ బాధ్యతలన్నీ మండలాల అభివృద్ధి అధికారులపై ఉండగా.. జిల్లా పంచాయతీల వనరుల కేంద్రం (డీపీఆర్సీ) ఆధ్వర్యంలో వీటి నిర్వహణ అమలు బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంది. అయితే పర్యవేక్షణ లోపం కారణంగా కేంద్రాలు కునారిల్లిపోతున్నాయి.
జిల్లాలో చాలా పంచాయతీల్లో ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్లు పాడైపోయాయి. అలాగే చాలా చోట్ల అసంపూర్తిగా షెడ్ల నిర్మాణాలు జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు మేరకు ఈ షెడ్ల వద్ద మరమ్మతుల పనులన్నీ ఈ మార్చి 31లోగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని చర్యలు చేపడుతున్నాం. అలాగే వర్మీ కంపోస్టును తయారి చేసే విషయంలోనూ ప్రాధాన్యతగా పర్యవేక్షిస్తున్నాం. – కె.నిశ్చల, డీపీఆర్సీ కోఆర్డినేటర్
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా..
Comments
Please login to add a commentAdd a comment