నేడు రణస్థలం బంద్
రణస్థలం: గ్రామస్తులకు, వ్యాపారులకు కనీస సమాచారం ఇవ్వకుండా రణస్థలం పట్టణంలో ఫ్లై ఓవర్ పనులను రెవెన్యూ, హైవే అధికారులు ప్రారంభించడాన్ని నిరసనగా వ్యాపారులు గురువారం స్వచ్ఛంద బంద్‌కు పిలుపునిచ్చారని ఫ్లైఓవర్ వ్యతిరేక కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలోని రామతీర్థాలు కూడలి వద్ద రణస్థలం, జె.ఆర్.పురం గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. హైవే అధికారులు మార్కింగ్ వేసి ఇష్టారాజ్యంగా సర్వేలు చేపడుతున్నారని, ప్రాజెక్టు వివరాలు బహిర్గతం చేయకుండా పనులు ప్రారంభించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నించారు. గురువారం జరిగే బంద్‌లో అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
● ఫ్లై ఓవర్ నిర్మాణంపై నిరసన
● సమాచారం ఇవ్వకుండానే పనులు చేపడుతుండటంపై మండిపాటు
Comments
Please login to add a commentAdd a comment