ఉందా చిత్తశుద్ధి..?
చెత్తశుద్ధిపై
● జిల్లాలో అస్తవ్యస్తంగా ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్లు
● కూటమి ప్రభుత్వం వచ్చాక చెత్తపై చిత్తశుద్ధి లోపం
అరసవల్లి:
పల్లెల్లో ఘన వ్యర్థ పదార్థాల సంపద కేంద్రాలు(ఎస్‌డబ్ల్యూపీసీ) నామమాత్రంగా మిగిలిపోతున్నాయి. చెత్త నుంచి సంపద కేంద్రాలని పిలుచుకునే ఈ కేంద్రాలపై సర్కారుకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల లక్ష్యానికి దూరంగా ఉండిపోతున్నాయి. జిల్లాలో మొత్తం 912 పంచాయతీల్లో మొత్తం 690 పంచాయతీల్లో ఈ కేంద్రాల నిర్మాణాలు జరిగాయి. సుమారు 219 చోట్ల అసంపూర్తిగా నిర్మాణాలున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే అత్యధికంగా నిర్మాణాలు జరిగాయి. అప్పట్లో ఒక ఏడాదిలోనే గరిష్టంగా వర్మీ కంపోస్టు ఉత్పత్తి ద్వారా రూ.6.55 లక్షల వరకు ఆదాయం సమకూరగా, పొడి చెత్తతోనే రూ.5.81 లక్షల వరకు ఆదాయం లభించింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక ఈ ఏడు నెలల వరకు వర్మీ కంపోస్టు తయారీ అతి తక్కువ మోతాదులోనే చేయగలిగారు. వీటి ద్వారా ఆదాయం రూ.పదివేలకు కూడా చేరలేదనే సమాచారం. దీన్ని బట్టి జిల్లాలో అధికారుల పర్యవేక్షణ లోపం, పాలకుల చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment