పరీక్ష పాస్ చేస్తామంటూ డబ్బులు వసూలు
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్‌ల్లో పరీక్ష పాస్ చేస్తామంటూ నాన్ టీచింగ్ సిబ్బంది కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఒక ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ఈ మేరకు వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు కొందరు ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేసినట్లు తెలిసింది. ప్రధానంగా రీవాల్యుయేషన్, సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ అంశాన్ని ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్‌భాస్కర్ వద్ద ప్రస్తావించగా, అలాంటిది తమ దృష్టికి రాలేదని, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం పూర్తిస్థాయిలో పారదర్శకంగా ఉంటుందని అన్నారు. ఎవరైనా పాస్ చేస్తామంటే నమ్మవద్దని, వర్సిటీలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. వర్సిటీలో పరీక్షల నిర్వహణ వ్యవస్థ పటిష్టంగా ఉందని అన్నారు. అపోహలు నమ్మవద్దని చెప్పారు.
‘రూపాయి ఖర్చు లేకుండా బెయిల్’
శ్రీకాకుళం పాతబస్టాండ్: కారాగారంలో ఖైదీలుగా ఉన్న నిరుపేదలు రూపాయి ఖర్చు లేకుండా బెయిల్‌పై బయటకు రావడానికి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జిల్లా న్యా య సేవాధికార సంస్థ కార్యదర్శి రెడ్డి సన్యాసి నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. న్యాయ సహాయం పొందాలనుకునే వారు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌ను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఇంతవరకు వంద కేసులకు పైబడి బెయిళ్లు ఇప్పించామని, అలాగే 50 వరకు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించామని, ఇంకా 200 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ లీగల్ ఆఫీసర్ కొమరాపు ఆఫీస్ నాయుడు అన్నారు. సమావేశంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రతినిధులు పుట్టా అంజనీ కుమార్, పైడి హర్షవర్ధన్, గేదెల ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పలాసలో 30న మినీ జాబ్ మేళా
కాశీబుగ్గ: జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డీఆర్‌ఏ, సీడాప్ ఆధ్వర్యంలో పలాసలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఈ నెల 30న గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా మేనేజర్ రమణమూర్తి సోమ వారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో రెండు కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లామా, ఐటీఐ పూర్తి చేసి 18–35 ఏళ్లు కలిగిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పశువైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
ఎచ్చెర్ల క్యాంపస్: గ్రామాల్లో ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించే పశువైద్య శిబిరాలు పాడి రైతులు, గొర్రెలు, మేకలు పెంపకందార్లు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ రాష్ట్ర పరిశీలకులు, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సింహాచలం అన్నారు. తోటపాలేం, బొంతలకోడూరు గ్రామాల్లో సోమవారం నిర్వహించిన పశువైద్య శిబిరాలను పరిశీలించారు. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో పాడి ఆవుల పెంపకానికి ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు. గొర్రెలు, మేకలు పెంపకంతో సైతం మెరుగైన ఆదాయం వస్తుందని చెప్పారు.
ఎన్‌ఓసీ రద్దు చేస్తూ అగ్నిమాపక డీజీ ఉత్తర్వులు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని సౌత్ ఇండి యా షాపింగ్ మాల్ ఎన్‌ఓసీని రద్దు చేస్తూ రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపకశాఖ డీజీ మాచిరెడ్డి ప్రతా ప్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు పంపార ని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జె.మోహనరావు అన్నారు. శనివారం షాపింగ్ మాల్‌లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment