శ్రీకాకుళం న్యూకాలనీ: ఏలూరులోని శాయ్ స్పోర్ట్స్ హాస్టల్ ఎస్‌ఎల్‌కేసీలో ప్రవేశాలకు ఈ నెల 27, 28 తేదీల్లో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు డీఎస్‌డీఓ డాక్టర్ కె.శ్రీధర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో బాలికలు, అథ్లెటిక్స్‌లో బాలురుకు ఎంపికలు జరుగుతాయని చెప్పారు. 12 నుంచి 18 ఏళ్ల బాలబాలికలు అర్హులని తెలిపారు. ఎంపికై నవారికి ఉచిత వసతి, భోజన సదుపాయాలు, చదువుకు ఫీజులు, స్పోర్ట్స్ కిట్‌లు, ఇన్సూరెన్స్ సదుపాయాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కల్పిస్తుందని వివరించారు. ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం వెనుక జరిగే ఈ ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు ఒరిజినల్ ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డు, పాస్‌ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు సెంటర్ ఇన్‌చార్జి డీఎన్‌వీ వినాయక్(9885312356), వి.ఉదయ్‌సందీప్ (వెయిట్‌లిఫ్టింగ్ కోచ్)(9182993497) నంబర్లను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment