రూ.10 వేలు ఇవ్వాల్సిందే..
ఎవరి నుంచి ఫిర్యాదులు అందలేదు. ఫిర్యా దు చేస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రజారోగ్యం కోసం పాటు పడాలే తప్ప వసూళ్లకు పాల్పడకూడదు. సాధ్యమైనంత వరకు సక్రమంగా ఉండేలా హోటల్స్, స్వీట్‌స్టాల్స్ తదితర యజమానులకు అవగాహన కల్పించాలి. ఎప్పటికప్పుడు సూచనలు చేయాలి. ప్రమాదకరంగా ఉంటే శాంపిల్స్ తీసుకుని పరీక్షలు చేసి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి.
– కె.వెంకటరత్న,
అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, శ్రీకాకుళం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
ఆ అధికారి వస్తే చాలు హోటల్స్, స్వీట్ స్టాల్స్ యజమానులు హడలెత్తిపోతున్నారు. ఆహార తనిఖీల పేరుతో హడావుడి చేసి సొమ్ము గుంజుకుంటున్నారు. హోటల్‌కు వచ్చి దర్జాగా తిని, ఇంటికి పార్సిల్ కూడా కట్టించుకుని, ఆపై హోటల్‌కు ఇంత చొప్పున రేటు ఫిక్స్ చేసి దండుకుంటున్నారు. హోటల్స్, రెస్టారెంట్లకై తే ఏకంగా రూ.10 వేల చొప్పున డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా పలాసలో పలు హోటల్స్ యజమానులను ఇలాగే డిమాండ్ చేస్తే వారంతా గగ్గోలు పెట్టడంతో పాటు హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. చోటు చేసుకున్న పరిణామాలను ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్లారు.
జిల్లాలో దాదాపు 3వేలకు పైగా పెద్ద, చిన్నహోటల్స్ ఉన్నాయి. స్వీట్ స్టాల్స్ 200 వరకు ఉన్నాయి. లైసెన్స్‌డ్ కిరాణా షాపులు 1500 వరకు ఉన్నాయి. వీటితో పాటు ప్యాకింగ్ వాటర్ యూనిట్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. వీటిన్నింటినీ విధిగా తనిఖీ చేయాలి. నిబంధనల మేరకు వ్యవహరిస్తున్నారో లేదో చూసుకోవాలి. ప్రజారోగ్యానికి హాని జరగకుండా పర్యవేక్షించాలి. అంతవరకు ఫర్వాలేదు గానీ తనిఖీల ముసుగులో చేతివాటం ప్రదర్శించడంతో విమర్శలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఓ అధికారి వసూళ్లే లక్ష్యంగా చేసుకుని హోటల్స్, స్వీట్ స్టాల్స్ తదితర షాపులపై ‘దృషి’్ట పెడుతున్నారు.
ముఖ్యంగా హోటళ్లలోకి ఎప్పటికప్పుడు వెళ్లడమే కాకుండా తనకు కావాల్సిన వారిని తీసుకెళ్లి కడుపు నిండినంత తింటున్నారు. అంతటితో ఆగకుండా పార్శిల్స్ కట్టించి తీసుకుని వెళ్తున్నారు. అక్కడితో వదిలేయకుండా ఎప్పటికప్పుడు మామూళ్లకు తెగబడుతున్నారు. ఈ ప్రభావం మిగతా ప్రాంతాల్లో కంటే శ్రీకాకుళం నగరంలోని హోటల్స్‌పై ఎక్కువగా పడుతోంది. ఈయన బాగోతాలు ఆ హోటల్స్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. చెప్పినట్టుగా ఆ హోటల్స్ యజమానులు చేయకపోతే నానా హడావుడి చేస్తుంటారు. ఈయనతో ఎందుకని చాలా మంది సర్దుకుపోవాల్సి వస్తోంది.
ప్రజారోగ్యం కోసం తనిఖీలు చేయడంలో తప్పేమీ లేదు. కానీ దాన్ని ఆసరాగా తీసుకుని వసూళ్లకు తెగబడటమే కాకుండా ఫుడ్ కోసం కక్కుర్తి పడటం ముమ్మాటికీ తప్పే. ముఖ్యంగా హోటల్స్, స్వీట్ స్టాల్స్‌లో టేస్టింగ్ సాల్ట్, రకరకాల రంగులు వాడుతున్నారా? ప్లేట్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారా? తయారీకి వాడే వస్తువులు శుభ్రంగా ఉన్నాయా? లేదా? కిచెన్ నీటుగా ఉందా? ఏ రోజు ఆయిల్ ఆ రోజే వినియోగిస్తున్నారా? ఒకసారి ఫ్రై చేసేందుకు వాడిన ఆయిల్‌ను మళ్లీ వినియోగిస్తున్నారా? వండిన ఆహారం ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ప్రోజోన్ ఫుడ్స్‌ను ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా? ఇలాంటివన్నీ తనిఖీ చేసి సరి చేయాలి. ఎక్కడైనా తేడాలుంటే సూచనలు చేయడంతో పాటు హెచ్చరికలు చేయాలి. ముఖ్యంగా హోటల్స్, స్వీట్ స్టాల్స్ తదితర వన్నీ క్లీన్‌గా, స్వచ్ఛమైన పదార్థాలతో ఆహార ఉత్పత్తులు తయారు చేసేలా సంబంధిత యజమానులకు అవగాహన కల్పించాలి. సీరియస్ నెస్ ఎక్కువగా ఉంటే కేసులు నమోదు చేయాలి. అవసరమైతే విజిలెన్స్‌కు రాయాలి. ఈ రకమైన పర్యవేక్షణ చేయాల్సింది పోయి తన స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని వాడుకోవడం విమర్శలకు తావిస్తోంది.
ఓ అధికారి చేతివాటం
హోటల్స్, స్వీట్ స్టాల్స్, ఇతర షాపుల నుంచి అడ్డగోలు వసూళ్లు
తాజాగా పలాసలో ఒక్కొక్క హోటల్ నుంచి రూ.10వేలు డిమాండ్
హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధుల
దృష్టికి తీసుకొచ్చిన అక్కడి
యజమానులు
ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన
అసోసియేషన్ నాయకులు
తాజాగా పలాసలో హోటల్స్ తనిఖీకి వెళ్లిన ఈ అధికారి ఒక్కోక్క హోటల్ నుంచి రూ. 10వేలు డిమాండ్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఒక్కసారిగా రూ.10వేలు అంటే కష్టమని సదరు హోటల్స్ యజమానులు ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని సంబంధిత హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అసోసియేషన్ నాయకులు అక్కడి ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లి వ్యాపారాలు సక్రమంగా చేసుకునేలా చెప్పాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం నగరంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది.
రూ.10 వేలు ఇవ్వాల్సిందే..
Comments
Please login to add a commentAdd a comment