● దోబూచులాట..
పాలకొండకు మాజీ సీఎం వైఎస్ జగన్ రాక నేడు
నరసన్నపేట: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి పాలకొండకు గురువారం రానున్నారని, ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపు నిచ్చారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎంతో రాజకీయ చరిత్ర కలిగి అనేక పదవులు పొంది ప్రజలకు సేవ చేసిన పాలవలస రాజశేఖరం ఇటీవల మర ణించిన విషయం విదితమే. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రానున్నారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు పాలకొండ పట్టణానికి వస్తారని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
శ్రీముఖలింగంలో బారికేడ్లు ఏర్పాటు
జలుమూరు: శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీముఖలింగంలో బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ఈఓ పి.ప్రభాకరరావు బుధవారం తెలిపారు. ముందుగా ఆలయం రెండు వైపులా మాడవీధుల గుండా బారికేడ్లు ఏర్పాటుచేసి అవసరమైతే ఆలయ పరిసరాల్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయంలో తొమ్మిది సీసీ కెమెరాలు ఉండగా అదనంగా సీసీ కెమెరాలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
నేడు జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు
అరసవల్లి: జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు గురువారం ఉదయం 10.30 గంటల నుంచి జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లుగా జెడ్పీ సీఈఓ ఎల్‌ఎన్‌వి.శ్రీధర్‌రాజా తెలియజేశారు. ఈ మేరకు ఉదయం 10.30 గంటల నుంచి 6వ స్థాయీ, 11.30 గంటలకు 3వ, 12.30 గంటల నుంచి 5వ, అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి వరుసగా 2వ, 4వ, 1వ, 7వ స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతా యని ప్రకటించారు. సంబంధిత ఉమ్మడి జిల్లా అధికారులంతా తమ శాఖల ప్రగతి నివేదికలతో హాజరుకావాలని కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) పాత్ర కీలకమని సహాయ ఎన్నికల అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. సూక్ష్మ పరిశీలకులతో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని కచ్చితంగా అనుసరించాల ని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏవైనా అనుమానాలు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు.
● దోబూచులాట..
● దోబూచులాట..
● దోబూచులాట..
Comments
Please login to add a commentAdd a comment