కార్తీకదీపానికి ప్రమిదలు సిద్ధం
● బంకమట్టి సేకరణకు ప్రభుత్వం
అనుమతివ్వడంపై కుమ్మరుల హర్షం
తిరుత్తణి: నవంబర్ 13న కార్తీక దీపోత్సవం సందర్భంగా ప్రమిదల తయారీ ఊపందుకుంది. ఇందుకోసం బంకమట్టిని ఉచితంగా తరలించేందుకు ప్రభుత్వం అనుమతితో కుమ్మరులు రెట్టింపు ఉత్సాహంతో పెద్దసంఖ్యలో ప్రదిమలు తయారు చేసి విక్రయానికి సిద్ధమతున్నారు. కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం వేడుకగా జరుపుకోవడం పరిపాటి. కొండ కార్తీక, ఊరే కార్తీకగా రెండు రోజుల పాటు దీపాల పండుగను మహిళలు వేడుకగా జరుపుకుని తమ ఇళ్ల నిండా ప్రమిదలతో దీపాలు వెలిగించి కాంతి నింపడం పరిపాటి. ఇందుకోసం తిరుత్తణి, పళ్లిపట్టు పరిసర ప్రాంతాల్లోని 20 గ్రామాల్లో కుమ్మరులు ప్రమిదలు తయారీ చేసే పనుల్లో నిమగ్నమైయ్యారు. మార్కెట్‌లో రకరకాల ప్రమిదలు అందుబాటులోకి వచ్చినా కుమ్మరులు బంకమట్టితో చేసే ప్రమిదలకు మహిళల్లో డిమాండ్ భారీ ఉంది. దీంతో ప్రమిదల వ్యాపారం సైతం జోరుగా సాగుతుంది. చిన్నసైజు ప్రమిదలు రూ. 10కి 5 విక్రయిస్తున్నట్లు, పెద్ద సైజు రూ. 20కు 5 విక్రయిస్తున్నట్లు తెలిపారు. బంకమట్టికి ప్రభుత్వం ఉచిత అనుమతి గతంలో బంకమట్టి వినియోగించేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధించేది. దీంతో కుమ్మరి కార్మికులు డబ్బులు ఖర్చుపెట్టి బంకమట్టి తీసుకొచ్చి తయారు చేసేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం సీఎం స్టాలిన్ కుమ్మరి కులస్తుల బతుకులు బాగుపడాలనే ఆశయంతో బంకమట్టి ఉచితంగా తరలించి మట్టి కుండలు, వినాయకుడి బొమ్మలు, ప్రమిదలు తయారు చేసుకునేందుకు అనుమతితో చాలామంది కుమ్మరి కులస్తులు జీవనోపాధి పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment